Home » Ram Charan : విజయ్ ‘లియో’లో మెగా హీరో రామ్ చరణ్… ఇదిగో ఇదే సాక్ష్యం!

Ram Charan : విజయ్ ‘లియో’లో మెగా హీరో రామ్ చరణ్… ఇదిగో ఇదే సాక్ష్యం!

by Bunty
Published: Last Updated on
Ad

హీరో విజయ్ తాజా చిత్రం ‘లియో’ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో పథకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. త్రిష కథానాయికగా కనిపించనుంది. మరో హీరోయిన్ గా ప్రియ ఆనంద్ ను ఎంపిక చేశారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, మన్సూర్ ఆలీఖాన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ ఇటీవలే కశ్మీర్ కు వెళ్ళింది.

Advertisement

 

అక్కడ నెలకు పైగా భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, తాజాగా లియో టైటిల్ వీడియోని రిలీజ్ చేశారు. ఫుల్ మాసిగా ఉన్న ఈ టీజర్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తోంది. కాశ్మీర్ లో చాక్లెట్ ఫ్యాక్టరీ రన్ చేస్తున్న విజయ్ కోసం బ్లాక్ కలర్ కార్స్ లో కొందరు ముసుగు వేసుకున్న వ్యక్తులు వస్తున్నట్లు వీడియోలో చూపించారు. అందులో ‘TS 03 BR 2159’ అనే ఓ బండికి నంబర్ ప్లేట్ ఉంది.

Advertisement

ఇది చూసిన చాలామంది, తమిళ సినిమాలో తెలుగు స్టేట్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఉంది ఏంటి అని మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇది రామ్ చరణ్ పాత్రకు సంబంధించింది అని అంటున్నారు. గతంలో విక్రమ్ సక్సెస్ తర్వాత చిరంజీవి, లోకేష్ కమల్ హసన్ ని సన్మానించారు. అప్పటినుంచి చరణ్ లోకేష్ కనగరాజ్ తో సినిమా చేస్తాడని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇది చూసి ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు. మరో అడుగు ముందుకేసి, లియోలో చరణ్ పోలీస్ గా కనిపిస్తాడని అంటున్నారు. ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

read also : Amigos Movie : “అమిగోస్” సినిమా ప్లస్ పాయింట్స్ ఇవే…కళ్యాణ్ రామ్ చేసినట్టేనా?

Visitors Are Also Reading