ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన కొనసాగుతుంది. రాష్ట్రాన్ని ఓ సైకో పాలిస్తున్నాడని.. పిచ్చోడి చేతికి రాష్ట్రాన్ని అప్పగించారు. మరో ఆరు నెలల్లో టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించి అభివృద్ధికి బాటలు వేద్దామని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్న మాటలు ఇవి. ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో శిక్ష అనుభవిస్తున్నాడు చంద్రబాబు. గత ఎన్నికల్లో ఎదురైన పరాభవాన్ని అధిగమించి ఎలాగైనా సరే విజయం సాధించాలనే పట్టుదల ప్రదర్శించిన బాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
Advertisement
స్కిల్ డెవలప్ మెంట్ కింద జైలు పాలవుతానని కలలో కూడా ఊహించి ఉండడేమో చంద్రబాబు. 2024 ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అని.. ఈ ఎన్నికల తరువాత తాను రాజకీయాలకు విరామం తీసుకుంటానని చెప్పిన బాబు.. ఊహించని విధంగా ఎన్నికలకు ముందే విరామం తీసుకునే పరిస్థితి నెలకొంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు ఆధారాలతో అరెస్టు కావడం వల్లనే ఆయన తరపున వాదించే లాయర్ సిద్ధార్థ్ లూథ్రా ఎంచ ప్రయత్నిస్తున్నప్పటికీ ఏపీ సీఐడీ కౌంటర్ ఇస్తోంది. ముందు ముందు చంద్రబాబుపై మరిన్ని పిటీ వారెంట్లు మెప్పేందుకు సిద్ధం అవుతోంది. ఈ తరుణంలో చంద్రబాబు జైలు కే పరిమితం కావాల్సిందేనా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
Advertisement
తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలను ఓసారి పరిశీలించినట్టయితే.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ విషయాన్ని ఇటీవలే వైసీపీ ప్రకటించింది. ఎన్నికల సమయానికి బాబు బయటికి వస్తారా ? లేదా అనే డౌట్లు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితులుంటే చంద్రబాబుకు మరో ఆరు నెలలు జైలు శిక్ష తప్పదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈసారి ఎన్నికల సమయం అంతా చంద్రబాబు జైలులోనే గడిపే అవకాశముంది. ఈ ప్రభావం టీడీపీకి ఎలాంటి ఫలితాలను ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కలలు కన్నా చంద్రబాబుకి స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ ద్వారా ఊహించని విధంగా సీఎం జగన్ బ్రేకులు వేశారనేది స్పష్టంగా అర్థం అవుతుంది. ఆంధ్రాలో రాజకీయాలు ఎలా ఉంటాయో తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురుచూడాలి మరీ.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
చంద్రబాబు అరెస్ట్ తరువాత ఎన్టీఆర్ దుబాయ్ కి ఎందుకు వెళ్లాడో తెలుసా ?