Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం..!

బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం..!

by Bunty
Ads

మన చిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే వివిధ కారణాలవల్ల చాలామంది ప్రముఖ నటీనటులు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి చాలామంది సినీ ప్రముఖులు మరణించారు. కరోనా మహమ్మారితో కొంతమంది మరణించగా మరికొంతమంది మాత్రం గుండెపోటుతో ఇండస్ట్రీని వదిలి వెళ్లారు. అయితే తాజాగా తమిళ చిత్ర పరిశ్రమలో ఓ విషాదం చోటుచేసుకుంది.

Advertisement

Ad

తమిళ నటుడు, బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె మీరా ఆ**త్మ-హ***త్య చేసుకుంది. చెన్నైలోని నివాసంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఉదయాన్నే ఇంట్లో వాళ్ళు చూసేసరికి ఆమె ఉరేసుకుని కనిపించగా… వెంటనే హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె మీరా వయసు 16 ఏళ్లు మాత్రమే కావడం గమనార్హం.

Advertisement

తీవ్రమైన ఒత్తిడితోనే ఉరేసుకుని ఆ**త్మ-హ***త్య చేసుకున్నట్టు తెలుస్తోంది. చెన్నైలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మీరా 12వ తరగతి చదువుతోంది. విజయ్ నిర్మాత ఆయిన ఫాతిమాను 2006లో వివాహం చేసుకున్నారు. వీరికి మీరా విజయ్ ఆంటోనీ, లారా విజయ్ ఆంటోనీ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు మీరా ఆ**త్మ-హ***త్య చేసుకోవడంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక విజయ్ ఆంటోనీ కూతురు మరణించడం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ కుటుంబానికి భరోసా కల్పించేందుకు ఆయన ఇంటికి వస్తున్నారు సినీ ప్రముఖులు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading