Home » మెగాస్టార్ వల్లే నష్టపోయాను.. అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్..!

మెగాస్టార్ వల్లే నష్టపోయాను.. అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్..!

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్వయంకృషితో పైకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక మెగాస్టార్ తర్వాత ఆ ఫ్యామిలీ నుండి అరడజను మంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. నాగబాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వైష్ణవ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఇలా చాలామంది ఇండస్ట్రీలోకి ప్రవేశించి టాలెంట్ తో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

కానీ వీరిలో అల్లు అర్జున్ మాత్రం చిరంజీవి కారణంగా డబ్బులు నష్టపోయారట. అదెలా అని ఆలోచిస్తున్నారా. ఈ విషయాన్ని ఓ ఇటర్వ్యూలో స్వయంగా అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. అయితే బన్నీ డబ్బులు పోగొట్టుకుంది మెగాస్టార్ డాన్స్ కారణంగా అని చెప్పి షాక్ ఇచ్చారు. చిరు డాన్స్ గురించి ఆయన బాడీలో ఉన్న గ్రేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంద్ర సినిమా సమయంలో బన్నీకి, తన ఫ్రెండ్ కి మధ్య ఓ చిన్న చర్చ జరిగిందట.

దాయి దాయి దామా పాటలో చిరంజీవి వీణ స్టెప్ వేసేటప్పుడు ఆయన పక్కన సోనాలి బింద్రే ఉందని, లేదని బన్నీ ఇద్దరు వాదించుకున్నారట. బన్నీ ఇంద్ర సినిమా 17 సార్లు చూశారట. అందులో బాస్ సోలోగానే స్టెప్ వేశారని మొండిగా వాదించారట. అంతేకాదు ఈ పాయింట్ పై 25 వేలు బెట్ కూడా కట్టారట. కానీ ఆఖరికి వీడియో చూస్తే చిరు పక్కన సోనాలి బింద్రే కూడా స్టెప్ వేసింది. అప్పుడు తన స్నేహితుడి దగ్గరకు వెళ్లి నువ్వు చెప్పిందే నిజమని, కానీ పక్కన హీరోయిన్ ఉన్న ఆమె వైపు కంటి చూపు కూడా వెళ్లకుండా చిరంజీవి గారి డాన్స్ మాత్రమే చూసేలా చేశారని చెప్పారట. అలా మెగాస్టార్ కారణంగా అల్లు అర్జున్ పాతిక వేల రూపాయలు నష్టపోయారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading