Home » రక్తంలో చక్కెర అదుపులో ఉండాలంటే.. డయాబెటిక్‌ పేషెంట్లు ఈ పండ్లు తప్పకతినాల్సిందే !

రక్తంలో చక్కెర అదుపులో ఉండాలంటే.. డయాబెటిక్‌ పేషెంట్లు ఈ పండ్లు తప్పకతినాల్సిందే !

by Anji
Ad

సాధారణంగా  రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి టీలో చక్కెరను తగ్గించుకోవడమే కాదు, స్వీట్లు కూడా తినకూడదు. కానీ ఇంత చేసిన షుగర్ లెవెల్ ఒక్కోసారి అదుపులోకి రాదు.  మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారంలో ఏమేమి తింటే ఈ సమస్య తగ్గుతుందో నిపుణుల మాటల్లో మీకోసం. చక్కెర తినక పోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు అని అనుకుంటారు. కానీ జీవన శైలిలో కొన్ని రకాల మార్పులు చేయడం మూలంగా ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా తినడం, త్రాగడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రై ఫ్రూట్స్ ని డయాబెటిస్ డైట్ లో ఉంచుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా వరకు తగ్గుతాయి.


డ్రై ఫ్రూట్స్ లో విటమిన్లు, ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ లో అనేక గింజలు, ఎండిన పండ్లు, విత్తనాలు కూడా ఉంటాయి. కానీ వీటిల్లో ఎక్కువ ప్రయోజనకరమైనవి ఏంటో తెలుసా? నిపుణుల అభిప్రాయం ప్రకారం, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలనుకుంటే అత్తి పండ్లను తినడం ప్రారంభించండి. అత్తి పండ్లు రక్తంలో అదనపు చక్కెరను గ్రహిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా అంజీర్ పండ్లలో ప్రోటీన్, మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్ విటమిన్లు సి, కె, ఎ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంజీర్ పండ్లలో డైటరీ ఫైబర్ ఉంటుంది. చక్కెరను గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే ఈ పండు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Advertisement

Advertisement


మధుమేహ వ్యాధిగ్రస్తులు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఇది రక్తంలో చక్కర స్థాయిని త్వరగా పెంచదు. అంజీర్ పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ 51 ఉంది. ఇది మధుమేహం చికిత్సకు మంచిది. అంజీర్ పండ్లలో కూడా సహజ చక్కెరలు ఉంటాయి. ఇందులో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ కూడా ఉంటాయి. ఫైబర్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. అయితే, అంజీర్ పండ్లను కూడా సహజ చెక్కరలో ఉండడం వల్ల తినడానికి తియ్యగా ఉంటాయి. అందుకే అంజీర్ పండ్లను పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. అంజీర్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్యాంక్రియాటిక్ బీటా కణాలతో సహా మిగిలిన కణాలపై రక్షిత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అంజీర్ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో మంటను తగ్గిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్   కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading