Home » అత్త చేతిలో ధోని వ్యాపారం..ఏకంగా రూ.800 కోట్లు !

అత్త చేతిలో ధోని వ్యాపారం..ఏకంగా రూ.800 కోట్లు !

by Bunty
Ad

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని… గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2007 కంటే ముందు టీమిండియాలోకి అరంగేట్రం చేసిన మహేంద్ర సింగ్ ధోని… ఆ తర్వాత టీమిండియా జట్టు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టడమే కాకుండా… జట్టుకు 2007 t20 ప్రపంచ కప్, 2011 ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ లను అందించాడు మహేంద్ర సింగ్ ధోని.

Advertisement

ఆ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన మహేంద్రసింగ్ ధోని… ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. అలాగే పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. అంతేకాకుండా కొన్ని కంపెనీలలో పెట్టుబడులు కూడా పెట్టి బాగానే సంపాదిస్తున్నాడు. అటు వ్యవసాయ రంగంలోనూ దూసుకుపోతున్నాడు మహేంద్ర సింగ్ ధోని. ఇక ఇటీవలే చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చేసాడు మహేంద్ర సింగ్ ధోని. ఇటీవల ధోని ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటుచేసి… ఎల్ ఎస్ జి అనే సినిమాను కూడా తీస్తున్నాడు ధోని. అయితే ఈ మహేంద్రసింగ్ ధోని ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ కంపెనీ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా… ధోనికి పిల్లనిచ్చిన అత్తగారు శిలా సింగ్ కొనసాగుతున్నారట.

Advertisement

నేషనల్ మీడియా కథనం ప్రకారం… సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ధోని… తన ప్రొడక్షన్ కంపెనీలో కుటుంబ సభ్యులకే భాగస్వామ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడట. ఇందులో భాగంగానే తన భార్య సాక్షి యొక్క తల్లి షీలా సింగ్ కు ఈ ప్రొడక్షన్ కంపెనీ బాధ్యతలను అప్పగించాడట ధోని. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాకా ధోని ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ ఆస్తుల విలువ ఏకంగా 800 కోట్లు అని సమాచారం. అంటే ఈ 800 కోట్ల ఆస్తినీ… మహేంద్ర సింగ్ ధోని అత్తమ్మ కాపాడుతోందన్నమాట.

Visitors Are Also Reading