Home » DHAMAKA TWITTER REVIEW IN TELUGU : రవితేజ ‘ధమాకా’ ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందంటే..?

DHAMAKA TWITTER REVIEW IN TELUGU : రవితేజ ‘ధమాకా’ ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందంటే..?

by Anji
Ad

DHAMAKA TWITTER REVIEW IN TELUGU: మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ధమాకా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రమోషన్లు అన్ని ప్రేక్షకులను మెప్పించడంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఆల్రెడీ ప్రీమియర్ షోలో ప్రారంభం కావడంతో సోషల్ రవితేజ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ప్రీమియర్ షోల నుంచి ధమాకాకి ఆసక్తికరమైన రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ లో తమదైన స్పందన తెలియజేస్తున్నారు. 

RAVI TJEJA DHAMAKA  MOVIE TWITTER REVIEW IN TELUGU

DHAMAKA TWITTER REVIEW IN TELUGU

DHAMAKA TWITTER REVIEW IN TELUGU

ముఖ్యంగా ఈ సినిమా ఊహించని ట్విస్ట్ తో ప్రారంభమవుతుందట. రవితేజ ఈ చిత్ర భారాన్ని మొత్తం తన భుజాలపై వేసుకొని మోశాడట. మరోవైపు ధమాకా స్టోరీ రొటీన్ గానే ఉంది. ఫస్టాప్ ప్లాట్ గా అనిపిస్తుందట. కానీ రవితేజ తన ఎనర్జీతో ఎంటర్ టైనింగ్ గా మార్చేసాడు. ప్రధానంగా ఇంటర్వెల్ సీన్ అందరినీ ఆకట్టుకుంటుంది. కామెడీ, పాటలు, ఇంటర్వెల్ సీన్ కొన్ని అంశాలు ఫస్టాప్ ని హైలెట్ గా నిలిపాయని ఓ నెటిజన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

Advertisement

Advertisement

Also Read :   కమెడియన్ ఆలీ ఫస్ట్ లవర్ ఎవరో తెలుసా ?

Manam News

DHAMAKA  REVIEW

మరోవైపు సింగిల్ స్క్రీన్ లో పూనకాలు గ్యారెంటీ అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. కొంతమంది ధమాకా డబుల్ బ్లాక్ బస్టర్ బొమ్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రావు రమేష్ కామెడీ అదిరిపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా వెంకీ, దుబాయ్ శీను, కిక్ కలిపి కొడితే ధమాకా. రవితేజ పెర్పామెన్స్ అద్భుతంగా ఉంది. పాత రవితేజని మళ్లీ చూసి ఎంజాయ్ చేయండి. మాకు కావాల్సింది ఇదే రవి అన్నా అంటూ ఓ నెటిజన్ పేర్కొనడం విశేషం. చాలా మంది ధమాకాలో రవితేజ వింటేజ్ ని చూస్తామంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరొకొందరూ మాత్రం ధమాకా అవుట్ డేటెడ్ మూవీ అని, పదేళ్ల కిందట వచ్చిన పాత చిత్రాన్ని చూస్తున్నట్టు చిరాకు పుట్టించారు అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.  

Also Read :   వీరసింహారెడ్డిలో బాలయ్య మూడు పాత్రల్లో కనిపించనున్నారా..?

Visitors Are Also Reading