Home » కమెడియన్ ఆలీ ఫస్ట్ లవర్ ఎవరో తెలుసా ?

కమెడియన్ ఆలీ ఫస్ట్ లవర్ ఎవరో తెలుసా ?

by Anji
Ad

తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడీయన్ ఆలీ గురించి తెలియని వారుండరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రహ్మానందం తరువాత అంతటి కమెడియన్ గా పేరు పొందారు ఆలీ. ముఖ్యంగా ఎన్నో కష్టాలు పడి ఇంతటి స్టేజ్ కి వచ్చాడు. కమెడియన్  ఆలీ ఇప్పటివరకు 1000 సినిమాలకు పైగా నటించాడు. 

Advertisement

 

ఇటీవలే తన కూతురు ఫాతిమా పెళ్లి చేసి అత్తారింటికి పంపించాడు. పెళ్లికి సంబంధించిన ప్రతీ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఆలీ బార్య జుబేదా. ఇక ఆ వీడియోలలో ఆలీ దంపతులను చూసిన వారు ఎవ్వరైనా వీరిది అన్యోన్య దాంపత్యం అంటూ మెచ్చుకోక ఉండరు. జుబేదా కంటే ముందు వేరొకరిపై మనసు పారేసుకున్నాడట అలీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆలీ ఈ విషయాన్ని వెల్లడించారు.  

Also Read :  వీరసింహారెడ్డిలో బాలయ్య మూడు పాత్రల్లో కనిపించనున్నారా..?

Advertisement

“అప్పుడు నా వయస్సు 17 సంవత్సరాలు అనుకుంటాను. మా ఇంటి పక్కన ఓ అమ్మాయి ఉండేది. ఆమె కళ్లు చాలా బాగుంటాయి. పొడువు అయినటువంటి జుట్టు ఉండేది. ఆమె చాలా అందంగా ఉండేది. నన్ను చూసి చిరినవ్వు నవ్వేది. ఒకరోజు ఆమె వర్షంలో తడుచుకుంటూ వస్తోంది. నేను ఎదురుగా వెళ్లి గొడుగుపట్టాను. అలా మా మధ్య బాగానే నడిచింది. 21 ఏళ్లు వచ్చాక అమ్మ దగ్గరికి వెళ్లి ఆమెకు తండ్రి లేడు, ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పాను. అమ్మ సరేనంది. ఆ తరువాత ఒకరోజు అమ్మ తమ్ముడితో పాటు సినిమాకు వెళ్లింది. ఆ థియేటర్ కి అమ్మాయి తన స్నేహితులతో కలిసి వచ్చింది. ఇంటికి వచ్చాక అమ్మ అమ్మాయి వద్దని చెప్పింది. ఆ అమ్మాయి వంక చూడడం మానేసి బుద్దిగా నా పని నేను చూసుకున్నాను. ఇక ఆ తరువాత పెళ్లి సంబంధాలు చూసినప్పుడు ఓ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసింది. దీంతో నాకు కోపం వచ్చి అదే కుటుంబంలో ఉన్న వాళ్లను పెళ్లి చేసుకుంటానని అమ్మకు చెప్పాను. అలా అక్కను చూడడానికి వెళ్లి ఆమె చెల్లి జుబేదాను పెళ్లి చేసుకున్నాను” అని ఆలీ చెప్పుకొచ్చాడు.  

Also Read :  టాలీవుడ్‌ లో బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్నా..హీరోయిన్లుగా అట్టర్‌ ఫ్లాఫ్‌ అవుతున్న తారలు వీరే !

Visitors Are Also Reading