Home » వీరసింహారెడ్డిలో బాలయ్య మూడు పాత్రల్లో కనిపించనున్నారా..?

వీరసింహారెడ్డిలో బాలయ్య మూడు పాత్రల్లో కనిపించనున్నారా..?

by Anji
Ad

నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. గత ఏడాది అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో జనవరి 12తో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం హిస్తున్నారు. 

Advertisement

మరోవైపు సంక్రాంతి పండుగకి వీరసింహారెడ్డితో పాటు మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, తమిళ హీరో విజయ్ దళపతి వారసుడు, అజిత్ తెగింపు సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమాలన్నింటికీ పోటీగా బాలయ్య వీరసింహారెడ్డి సినిమా భారీ రేంజ్ లో విడుదల కాబోతుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన వార్త బయటికొచ్చింది. ఇప్పటివరకు ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలు మాత్రమే చేస్తున్నాడనే వార్త వినిపించింది. అందులో ఒకటి రాయలసీమలో ఉండే వీరసింహారెడ్డి పాత్ర కాగా.. మరొకటి అమెరికా నుంచి వచ్చే బాలసింహారెడ్డి పాత్ర.

Also Read :  ఆ ఒక్క అమ్మాయి వల్లే రజనీకాంత్ ఇంతటి స్టార్ హీరో అయ్యారు.. ఇంతకీ ఆమె ఎవరంటే..?

Advertisement

అయితే తాజాగా బాలకృష్ణ మూడు పాత్రల్లో నటించనున్నట్టు తెలుస్తోంది. మూడో పాత్రను మూవీ మేకర్స్ చాలా సస్పెన్స్ గా ఉంచినట్టు సమాచారం. కేవలం సినిమా చూస్తున్నప్పుడు మాత్రమే తెలిసే విధంగా దానిని సీక్రెట్ గా ఉంచారట. వీరసింహారెడ్డి సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. బాలయ్యకి జోడిగా శృతిహాసన్ నటిస్తోంది. అదేవిధంగా వరలక్ష్మీ శరత్ కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ దిగ్గజం థమన్ సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో రెండు పాటలు విడుదలయ్యాయి. మూడో పాట కూడా విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నది. మొత్తానికి ఈ చిత్రంలో బాలయ్య త్రి పాత్రలు చేస్తున్నాడో లేదో తెలియాలంటే మాత్రం జనవరి 12 వరకు వేచి చూడాల్సిందే. ఇక మూడు పాత్రల్లో నటిస్తే మాత్ర అభిమానులకు త్రిబుల్ ధమాకానే అని చెప్పవచ్చు. 

Also Read :  వేణు స్వామి చెప్పిన‌ట్టే న‌య‌న‌తార జీవితంలో స‌మ‌స్య‌లు మొద‌ల‌య్యాయా..?

Visitors Are Also Reading