Home » ఎన్టీఆర్ ఫస్ట్ హీరోయిన్ మీకు గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుందంటే ?

ఎన్టీఆర్ ఫస్ట్ హీరోయిన్ మీకు గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుందంటే ?

by Anji
Ad

జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వంశం నుంచి వచ్చిన హీరోలలో ఒకరు. నందమూరి వంశంలో ఎన్టీఆర్, బాలయ్య తరువాత అంతటి పవర్ పుల్ హీరో ఎన్టీఆర్. అచ్చం తాత పోలికలతోనే ఉండే ఈ కుర్రాడు నిన్నుచూడాలని సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకి పరిచయమయ్యాడు. వీ.ఆర్. ప్రతాప్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో హీరోయిన్ గా రవీనా రాజ్ పుత్ నటించింది. పలువురు సీనియర్ నటీనటులు సైతం నిన్నుచూడాలని చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. వారిలో కైకాల సత్యనారాయణ, అన్నపూర్ణ, సుధా, సుధాకర్, శివాజీ రాజా, కె.విశ్వనాథ్ వంటి వారు నటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన రవీనా ఇప్పుడు అస్సలు గుర్తు పట్టలేనివిధంగా మారిపోయింది. ఇంతకు ఆమె ఎక్కడ ఉంది..? ఏం చేస్తుంది..? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

Advertisement

ఎన్టీఆర్ తో కలిసి నిన్ను చూడాలని సినిమా చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత మరే సినిమాలో కూడా నటించలేదు. అంతకు ముందు విక్టరీ వెంకటేష్ తో కలిసి ఒంటరి పోరాటం అనే సినిమాలో నటించింది. 2001లో నిన్ను చూడాలని సినిమా అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రం తరువాత టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ తో సహా ఎక్కడా తాను సినిమాలు చేయలేదు. వాస్తవానికి ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమా తరువాత పలు అవకాశాల వస్తాయని భావించింది. కానీ ఈ చిత్రం ఆశించిన మేర ఆకట్టుకోలేదు. దీంతో ఆమెకు నటనపై కూడా ఇష్టం మెల్లమెల్లగా తగ్గిపోయింది. ఏది ఏమైనప్పటికీ నిన్ను చూడాలని సినిమాతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది రవీనా రాజ్ పుత్. 

Also Read :  “పవన్ మీ బావనా” అంటూ నెటిజన్ కామెంట్….షాకింగ్ రిప్లై ఇచ్చిన శ్రీరెడ్డి..!

Manam News

కొంత కాలం పాటు సైలెంట్ గా ఉండింది. ఇక ఆ తరువాత కూడా తనకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో సినీ పరిశ్రమకు దూరంగా ఉండాలనుకుంది. ఇక అదే సమయంలో ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపార వేత్తను రవీనా పెళ్లి చేసుకుంది. సినిమా పరిశ్రమకు రవీనా రదూరంగా కావడానికి ఏవేవో బలమైన కారణాలున్నాయని అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ తను ఎలాంటి వివరణ ఇవ్వలేదు. మళ్లీ వెండి తెర మీద కూడా కనిపించే ప్రయత్నం కూడా చేయలేదు.  

Also Read :  వేణు మాధవ్ చనిపోయిన తరవాత దారుణంగా ఆయన తల్లి పరిస్థితి…కొడుక్కి 20 కోట్ల ఆస్తులున్నా…!

Visitors Are Also Reading