Home » బాలయ్యకు డోస్ పెంచారు.. ఇక దబిడి దిబిడే..!

బాలయ్యకు డోస్ పెంచారు.. ఇక దబిడి దిబిడే..!

by Anji
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో వీరసింహారెడ్డి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. తాజాగా దసరా సందర్బంగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి మూవీ విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 

bhagavanth kesari 1

Advertisement

మొదటి షో నుంచే పాజిటివ్, హిట్ టాక్ రావడం.. ఇక అదే సమయంలో లియో, టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలకు యావరేజ్ టాక్ రావడంతో ఆడియన్స్ బాలయ్య మూవీ వైపునకు వస్తున్నారు. దీంతో కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో దంచవే మేనత్త కూతురా.. అనే సాంగ్ రీమిక్స్ చేశారనే విషయం తెలిసిందే. నాలుగున్నర నిమిషాల పాటు ఉన్న ఈ సాంగ్ రిమిక్స్ ను యాడ్ చేశారు. అయితే భగవంత్ కేసరి విడుదలైనప్పుడు ఈ సాంగ్ మాత్రమే కనిపించలేదు. నిడివి ఎక్కువ అవుతుందని.. పాటకు స్టోరీకి సంబంధం లేదనే ఉద్దేశంతో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సాంగ్ ను పక్కన పెట్టేశాడు. 

Advertisement

లక్షల రూపాయలు ఖర్చు చేసిన ఈ పాటకు దాదాపు 50 మందికి పైగా డ్యాన్సర్లు పని చేశారట. అంతేకాదు.. ఈ పాట కోసం ప్రత్యేకంగా ఓసెట్ ను కూడా వేశారట. అంత భారీగా షూట్ చేసినా.. ఈ స్టోరీకి లింక్ లేకపోవడంతో సాంగ్ మొత్తాన్ని పక్కన పెట్టేశారట. ప్రస్తుతం మంచి టాక్ రావడంతో ఈ సాంగ్ ను మళ్లీ చేసేశారు. సాంగ్ మొత్తం కాకుండా చివరలో వచ్చే దంచవే మేనత్త కూతురా.. అని సాగే రీమిక్స్ ను  మాత్రమే ఈ మూవీలో యాడ్ చేశారు. ఇక్కడ మరో చిక్కు కూడా ఉందండోయ్.. ఈ రిమిక్స్ సాంగ్ ను సినిమా మధ్యలో కాకుండా.. సినిమా చివరలో రోలింగ్ టైటిల్స్ వచ్చే సమయంలో దర్శకుడు ప్లాన్ చేసినట్టు సమాచారం. 

మరికొన్ని సినిమా వార్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Visitors Are Also Reading