టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో సరికొత్త సెంటిమెంట్ వర్కౌట్ అవుతోంది. ఆ సెంటిమెంట్ మరేదో కాదు.. కాకి సెంటిమెంట్. సినిమాలో కాకులకు ప్రాధాన్యత ఇచ్చి హిట్స్ అంటుకుంటున్నారు దర్శకులు. ఈ మధ్యకాలంలో కాకిని బేస్ చేసుకొని వచ్చిన 3 సినిమాలు కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
కాకి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాల్లో ఫస్ట్ చెప్పుకోవాల్సింది బలగం. ఈ చిత్రం చాలా సింపుల్ కథతో తెరకెక్కించి మంచి సక్సెస్ సాధించారు నటుడు, దర్శకుడు వేణు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మనిషి చనిపోయిన తరువాత కాకి పిండంను తినకపోవడం గురించి చూపించారు. అలా జరిగితే మరణించిన వారి ఆత్మ శాంతిచదనే కాన్సెప్ట్ తో తెరకెక్కించాడు. గొడవలు మరిచిపోయి కుటుంబం అంతా కలిసి ఉండాలనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది ఈ చిత్రం.
Advertisement
నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమాలో కూడా కాకి గురించి ఉంటుంది. ఈ సినిమాలో కాకి పిండాన్ని తినకపోవడాన్ని చూపించాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. దసరా సినిమా ఎంతటి సంచలనం విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
Also Read : నిర్మాత పరువు తీసిన సమంత… “చెవిలో వెంట్రుకలతో నువ్వు..” అంటూ సాలిడ్ కౌంటర్…!
ఇటీవల సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష మూవీలో కూడా కాకి హైలైట్ గా కనిపిస్తుంది. ఈ చిత్రంలో బ్లాక్ మ్యాజిక్ గురించి చూపించారు. బ్లాక్ మ్యాజిక్ ను రిప్రెజెంట్ చేస్తూ కాకులను చూపించారు. ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అందుకుంది. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది విరూపాక్ష. ఇలా కాకులను చూపించిన వరుస మూడు సినిమాలు సూపర్ హిట్ గా నిలవడం విశేషం.
Also Read : ఫ్యాన్ వార్ : పవన్ కళ్యాణ్ అభిమానిని కొట్టి చ**పిన ప్రభాస్ ఫ్యాన్!