Home » ఆసియా కప్ లో లేడు.. వేరే దేశం తరుపున ఆడడానికి ఆ ప్లేయర్ సిద్ధం..!

ఆసియా కప్ లో లేడు.. వేరే దేశం తరుపున ఆడడానికి ఆ ప్లేయర్ సిద్ధం..!

by Sravya

ఆగస్టు 30న ఆసియా కప్ లో పాల్గొనడానికి జట్లు సిద్ధమవుతున్నాయి భారత్ క్రికెట్ జట్టు ఇటీవల వెస్టిండీస్ ఐర్లాండ్లలో పర్యటించింది. అయితే ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా నుండి తొలగించిన ఆటగాడు ఇప్పుడు విదేశీ జట్టుకు ఆడడానికి సిద్ధమయ్యాడు. కెరీర్ ని కాపాడుకోవడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఉమేష్ యాదవ్. చాలా సందర్భాల్లో తన ఏంటో ప్రూవ్ చేసుకున్నారు ఉమేష్ యాదవ్. జూన్లో ఆస్ట్రేలియాతో జరిగిన 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో పాల్గొన్నప్పటికీ అంతర్జాతీయ క్రికెట్ మాత్రం ఆడలేదు ఉమేష్.

కౌంటీ సర్క్యూట్‌లో మిడిల్‌సెక్స్, హాంప్‌షైర్, నార్తాంప్టన్‌షైర్‌లతో జరిగే మ్యాచ్‌లకు ఉమేష్ ఉంటాడు. మాకు అద్భుతమైన ప్లేయర్ అని సీజన్లో కీలక సమయంలో అతను ఆయుధమని ఎసెక్స్‌లో ప్రధాన కోచ్ ఆంటోనీ చెప్పారు అలానే అతడు అనుభవజ్ఞుడు ఒక దశాబ్దం పాటు ఆటలో ఉన్నత స్థాయిలో వికెట్లు తీశాడని.. మాకు అదే సహకారం అందించడంతో పాటుగా యువ ఆటగాళ్లకు జ్ఞానాన్ని కూడా అందించాలని ఆశిస్తున్నామని చెప్పారు. ఎసెక్స్‌లో లో చేరడం నాకు చాలా ఆనందంగా ఉందని ఉమేష్ యాదవ్ చెప్పారు. గత సీజన్లో మిడిల్ ఎసెక్స్‌ తో ఇంగ్లాండ్ లో ఆడడం ఆనందించాను. టైటిల్ రేసులో నిలవాలని కోరుకుంటున్నాను అని ఉమేష్ యాదవ్ చెప్పారు.

Also read:

Visitors Are Also Reading