Home » CRICKET OLYMPICS : 2028 ఒలింపిక్స్​లో క్రికెట్.. 128 ఏళ్ల తర్వాత తొలిసారిగా

CRICKET OLYMPICS : 2028 ఒలింపిక్స్​లో క్రికెట్.. 128 ఏళ్ల తర్వాత తొలిసారిగా

by Bunty
Ad

ఒలంపిక్స్ లో క్రికెట్ ని కూడా చేర్చాలని డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉంది. అయితే అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో 2028లో జరగబోయే ఒలంపిక్స్ లో క్రికెట్ ను కూడా నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి. క్రికెట్ తో పాటు బేస్ బాల్, ఫుట్బాల్ లాంటి మరికొన్ని క్రీడలను ఒలంపిక్స్ లో చేర్చాలని ప్రతిపాదించినట్లు లాస్ ఏంజిల్స్ ఒలంపిక్స్ నిర్వాహకులు వెల్లడించారు.

Cricket Set For Olympics Return After 128 Years

Cricket Set For Olympics Return After 128 Years

దీనిపై అక్టోబర్ 15న ముంబైలో జరిగే అంతర్జాతీయ ఒలంపిక్స్ కమిటీ సమావేశంలో ప్రకటన చేసే అవకాశం ఉంది. అదే నిజమైతే దాదాపు 128 ఏళ్ల తర్వాత ఒలంపిక్స్ లో క్రికెట్ రీఎంట్రీ ఇవ్వనుంది. 1900లో జరిగిన ప్యారిస్ ఒలంపిక్స్ లో ఒకే ఒకసారి క్రికెట్ ను నిర్వహించారు. అందులో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ జట్లు మాత్రమే ఆడాయి.

Advertisement

Advertisement

ఆ తర్వాత వివిధ కారణాలతో ఈ ఆటను తొలగించారు. ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ప్రయత్నాలు జరుగుతుండటంతో ఐసీసీ కూడా సంతోషం వ్యక్తం చేసింది. కాగా ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్ 2023 మన ఇండియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఇండియాలో వన్డే వరల్డ్ కప్ జరుగుతోంది. ఇక ఈ వన్డే వరల్డ్ కప్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా పై టీమిండియా ఘన విజయం సాధించి మంచి ఆరంభాన్ని అందుకుంది.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading