Home » ‘స్టూడెంట్ నెం 1’ నుంచి ‘RRR’ వ‌ర‌కు రాజమౌళి సినిమాల క‌లెక్ష‌న్స్

‘స్టూడెంట్ నెం 1’ నుంచి ‘RRR’ వ‌ర‌కు రాజమౌళి సినిమాల క‌లెక్ష‌న్స్

by Anji
Ad

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి నుంచి సినిమా వచ్చింది అంటే ఎలా ఉంది అని అడగడం కాదు.. ఎంత బాగుంది అని అడగాలేమో..? అంతగా సంచలన విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు దర్శక ధీరుడు. దేశంలో నెంబర్ వన్ దర్శకుడు ఎవరు అంటే ఈ ప్రశ్నకు సమాధానం ఇదివరకు బాలీవుడ్ దర్శకుల వైపు చూసేవాళ్ళు. లేదంటే శంకర్ వైపు చూసేవాళ్లు. కానీ ఇప్పుడు కాలం మారింది. నేనున్నానంటూ నెంబర్ వన్ స్థానంలో కొన్నేళ్లుగా కదలకుండా కూర్చున్నాడు దర్శక బాహుబలి రాజమౌళి. తెలుగు సినిమా నుంచి మొదలైన ఆయన ప్రస్థానం ఇప్పుడు ప్రపంచ స్థాయికి ఎదిగింది. ఒక్క సినిమాకు రూ. 400 కోట్ల బడ్జెట్ పెట్టించే స్థాయికి చేరిపోయాడు రాజమౌళి.

Advertisement

ఇండియన్ సినిమా కలలు కన్నా రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించి చూపించారు ఈ దర్శకుడు. ఇలాంటి దిగ్గజ దర్శకుడు ప్రస్థానం ఈ మధ్యే 21 ఏళ్లు పూర్తయింది. 2001 సెప్టెంబర్ 27న రాజమౌళి తొలి సినిమా స్టూడెంట్ నెం 1 విడుదలైంది. ఈ 21 ఏళ్ల కాలంలో 12 సినిమాలు మాత్రమే చేశాడు జక్కన్న. మొదటి నుంచే ఒక్కో సినిమా కోసం ఎక్కువ సమయం తీసుకుంటూ వచ్చాడు రాజమౌళి. మరి ఈయన చేసిన 12 సినిమాలు.. అవి వసూలు చేసిన మొత్తం ఎంతో ఓ సారి తెలుసుకుందాం.

1.స్టూడెంట్ నెం 1 :

పెట్టిన బడ్జెట్: 2 కోట్లు, ఫ్రీ రిలీజ్ బిజినెస్: 2.75 కోట్లు, వచ్చిన కలెక్షన్స్: రూ. 12 కోట్లు. హీరోగా ఎన్టీఆర్ తో పాటు దర్శకుడిగా రాజమౌళి తొలిసారి సక్సెస్ రుచి ఏంటో ఈ సినిమాతో చూశారు.

2. సింహాద్రి:


పెట్టిన బడ్జెట్ 8 కోట్లు, ఫ్రీ రిలీజ్ బిజినెస్:రూ.13 కోట్లు, వచ్చిన కలెక్షన్స్ రూ. 26 కోట్లు. ఈ సినిమాతో ఎన్టీఆర్ ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు.

3. సై :

పెట్టిన బడ్జెట్: 5 కోట్లు, ప్రీ రిలీజ్ బిజినెస్: రూ.7 కోట్లు, వచ్చిన కలెక్షన్స్: రూ. 9.5 కోట్లు.

4. చత్రపతి :

పెట్టిన బడ్జెట్ :10 కోట్లు, ప్రీ రిలీజ్ బిజినెస్: రూ. 13 కోట్లు, వచ్చిన కలెక్షన్స్ : రూ. 21 కోట్లు.

5. విక్రమార్కుడు :

పెట్టిన బడ్జెట్ : రూ.11 కోట్లు, ప్రీ రిలీజ్ బిజినెస్ : రూ.14 కోట్లు, వచ్చిన కలెక్షన్స్ : రూ. 23 కోట్లు.

6. యమదొంగ :

పెట్టిన బడ్జెట్ : రూ.18 కోట్లు, ప్రీ రిలీజ్ బిజినెస్ : రూ. 22 కోట్లు, కలెక్షన్స్ : రూ. 29 కోట్లు.

7. మగధీర :

Advertisement

పెట్టిన బడ్జెట్ : రూ. 14 కోట్లు, ప్రీ రిలీజ్ బిజినెస్ : రూ. 48 కోట్లు, వచ్చిన కలెక్షన్స్ : రూ. 78 కోట్లు.

Also Read :  కోట శ్రీనివాస్ రావు కి కృష్ణం రాజు గారు చేసిన ఈ సహాయం గురించి తెలుసా ?

8. మర్యాద రామన్న :

పెట్టిన బడ్జెట్ : రూ. 14 కోట్లు , ప్రీ రిలీజ్ బిజినెస్ : రూ. 20 కోట్లు , వచ్చిన కలెక్షన్స్ : రూ . 29 కోట్లు.

9. ఈగ :

పెట్టిన బడ్జెట్ : రూ. 26 కోట్లు , ప్రీ రిలీజ్ బిజినెస్ : 32 కోట్లు , వచ్చిన కలెక్షన్స్ : రూ. 45 కోట్లు.

Also Read : చిరంజీవి గురించి ఎడిట‌ర్ మార్తాండ్ వెంక‌టేష్ ఏమ‌న్నారో తెలుసా..?

10. బాహుబలి బిగినింగ్ :

interesting facts about rajamouli bahubali movie details here , Bahubali Movie , Rajamouli , shocking facts , Rajamouli script,prabas , Baahubali The Beginning,Interval scene - Telugu Baahubali, Bahubali, Interval Scene, Prabas, Rajamouli

పెట్టిన బడ్జెట్: రూ. 136 కోట్లు, ప్రీ రిలీజ్ బిజినెస్ : రూ. 191 కోట్లు, వచ్చిన కలెక్షన్స్ : రూ. 600 కోట్లు. (సుమారు).

11. బాహుబలి ది కంక్లూజన్ :

పెట్టిన బడ్జెట్: రూ. 250 కోట్లు (రెండు భాగాలకు కలిపి), ఫ్రీ రిలీజ్ బిజినెస్ : రూ. 380 కోట్లు, కలెక్షన్స్ : రూ. 854 కోట్లు షేర్ .

Also Read :  కవలలు పుట్టిన ఆనందం ఎంతోసేపు లేదు..! నాయన తార విగ్నేష్ జంటకి షాక్ !

12. ఆర్ ఆర్‌ ఆర్ :

 

RRR

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ ఇద్ద‌రూ అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా థియేట్రికల్ రన్ క్లోజింగ్ వచ్చింది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే . 450 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం రూ. 272.31 కోట్లు షేర్ తెలంగాణ + ఏపీ లో వచ్చింది. రూ. 415 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇప్పటివరకు 20 ఏళ్లలో చేసిన 12 సినిమాలో ఒక్కటంటే ఒక్కటి కూడా అపజయం లేకుండా ముందుకు వెళ్తున్నాడు జక్కన్న. సై సినిమా మాత్రమే తక్కువ లాభాలు తీసుకు వచ్చింది కానీ ఇది కూడా హిట్ సినిమానే. అపజయం లేకుండా రెండు దశాబ్దాల కెరీర్ అంటే చిన్న విషయం కాదు. ఇక ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : రూ. 613.06 కోట్లు షేర్ (రూ.1150.10 కోట్ల గ్రాస్ ), (ఆర్ఆర్ఆర్ టోటల్ వర‌ల్డ్ వైడ్ బిజినెస్ రూ.. 451 కోట్లు) వసూళు చేసి దర్శకుడిగా సత్తా చాటాడు.

Also Read :  చిరంజీవి అలాంటి వ్యక్తి..!

Visitors Are Also Reading