Home » కోట శ్రీనివాస్ రావు కి కృష్ణం రాజు గారు చేసిన ఈ సహాయం గురించి తెలుసా ?

కోట శ్రీనివాస్ రావు కి కృష్ణం రాజు గారు చేసిన ఈ సహాయం గురించి తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో కృష్ణంరాజు రాజుల కుటుంబంలో జ‌న్మించాడు. రాజుల కుటుంబం అంటే ఎలా ఉంటుందో ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రమే లేదు. కృష్ణంరాజు దాన‌ధ‌ర్మాలు చేయ‌డంలో దిట్ట‌. ఆయ‌న చేసిన దానాల గురించి అస్స‌లు చెప్పేవాడు కాదు. కేవలం అతడికి మాత్రమే కాదు తన కుటుంబంలో ఎవరు కూడా చేసిన సహాయం, దానధర్మాల గురించి చెప్పుకోరు. అందుకే కృష్ణంరాజును చాలా మంచి వ్యక్తిగా ఇండస్ట్రీ పొగుడుతూ ఉంటుంది. తోటి నటీనటులకు కూడా ఆయన ఇచ్చే మర్యాద, సహాయం ఎంతో గొప్పగా ఉంటుంది. ఈ విషయం చెప్పింది మరి ఎవరో కాదండోయ్‌ నటుడు కోట శ్రీనివాసరావు.

Also Read : పవన్ కళ్యాణ్ గాడ్ ఫాదర్ మూవీని వద్దనుకోవడం వెనుక.. ఇంత పెద్ద ట్విస్ట్ ఉందా..!!

Advertisement

అప్పుడప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఏమీ తెలియక నలిగిపోతున్న రోజుల్లో కాల్షీట్ అనేది ఒకటి ఉంటుందనేది కూడా కోటకు తెలియని పరిస్థితి. ఎక్కడ షూటింగ్ జరిగితే అక్కడికి పరిగెత్తుకుని వెళ్లిపోయేవాడు కోట. అసలు ఎంత పారితోషికం తీసుకోవాలో కూడా కోటకు తెలియకుండా ఉన్న రోజుల్లో ఓ రోజు కృష్ణంరాజు ప్రొడక్షన్ కంపెనీ అయిన గోపికృష్ణ ఆఫీస్ కి వెళ్లారు. కృష్ణంరాజు తాండ్రపాపారాయుడు చిత్రంలో 15 రోజులపాటు కోట శ్రీనివాసరావు నటించాడు.కృష్ణంరాజు సోద‌రుడు, హీరో ప్ర‌భాస్ తండ్రి సూర్యనారాయణ రాజు లెక్కలు చూసేవారు. తన సినిమాకు సంబంధించిన రెమ్యూనరేషన్ తీసుకోవడానికి ఆఫీస్ కి వెళ్ళగా ఎంత ఇమ్మంటారో చెప్పమని సూర్యనారాయణ రాజు అడిగాడు. కానీ అసలు రెమ్యూనరేషన్ ఇంత తీసుకోవాలన్న విషయం కూడా కోటకు క్లారిటీ లేదు దాంతో నసుగుతూ కూర్చున్నాడు.

Advertisement

Also Read : ఖరీదైన కార్లలో తిరిగిన ఈ స్టార్ కమెడియన్..చివరికి డొక్కు సైకిల్ పై..కారణం వాళ్లేనా..?

ఇక అదే సమయంలో కృష్ణంరాజు గారు ఎంట్రీ ఇచ్చారు కోటని చూసి బాగా చేస్తున్నావ్. ఇలాగే కొన‌సాగించూ.. మంచి నటుడు అవుతావు అంటూ చెప్పాడట. ఇంతకీ ఎందుకు వచ్చావు అని అడగ్గా సూర్యనారాయణ రాజు కల్పించుకొని తాండ్రపాపారాయుడు కోసం 15 రోజులు పని చేశాడు డబ్బులు ఎంత కావాలి అంటే చెప్పకుండా కూర్చున్నాడు అని చెప్పగా కోటకి కృష్ణంరాజు ఒక సలహా ఇచ్చారట. ఇక్కడ డబ్బులు ఎంత కావాలో అడగకుండా ఎవరు ఇవ్వరు. 15 రోజులు చేశావు కదా రూ. 20,000 తీసుకొని వెళ్ళు. కొన్నాళ్లపాటు ఇలాగే తీసుకో.. ఇక ఆ తర్వాత పెంచుకుంటూ వెళ్ల‌మ‌ని చెప్పారట. దాంతో కోటా కూడా తూచా తప్పకుండా అదేవిధంగా ఫాలో అయ్యారట. ఇప్ప‌టికీ కూడా కోట అదే ఫాలో కావ‌డం విశేషం.

Also Read : పొన్నియన్ సెల్వన్ సినిమా గురించి చాలా మందికి తెలియ‌ని విష‌యం ఇదే..!

Visitors Are Also Reading