Home » చిరంజీవి అలాంటి వ్యక్తి..!

చిరంజీవి అలాంటి వ్యక్తి..!

by Azhar
Ad
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాధర్ హిట్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కంటే ముందు ఈ ఏడాదిలోనే చిరంజీవి నుండి వచ్చిన ఆచార్య అనే సినిమా డిజాస్టర్ అయ్యింది. అలాగే లూసిఫర్ రీమేక్ గా వస్తున్న గాడ్ ఫాధర్ కూడా ప్లాప్ అవుతుంది అనే కామెంట్స్ వచ్చాయి.. కానీ సినిమా కథలో చాలా మార్పులు అనేవి చెయ్యడం వల్ల.. కథ కొంత కొత్తగా అనిపించింది.
అయితే ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్స్ అనేవి అందుకుంది. ఇక ఈ సినిమాలో చిరంజీవితో పాటుగా చాలా మంది కనిపించారు. నయనతార ఆయన చెల్లెలుగా ఓ ముఖ్య పాత్రలో నటించగా.. సత్య దేవ్, పూరి జగన్నాథ్, సల్మాన్ ఖాన్ ఇలా చాలా మంది కనిపించడంతో ఫ్యాన్స్ కు కనుల విందుల మారిపోయింది గాడ్ ఫాధర్ సినిమా. అయితే తాజాగా నయనతార ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. చిరంజీవి పై కొన్ని ఆసక్తికార కామెంట్స్ అనేవి చేసింది.
గాడ్ ఫాదర్ సినిమా అనేది హిట్ కావడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పిన నయన్.. ఈ సినిమాను ఆదరించిన అందరికి ధన్యవాదాలు చెప్పింది. అలాగే ఈ సినిమాలో నటించడం చాలా ఎంజాయ్ చేశాను అని చెప్పిన నయన్.. చిరంజీవి ఒక్క జెమ్ అని పేర్కొంది. ఆయనలో ఓ పవర్ హౌస్ ఉంది అంటూ నయన్ చిరుపై ప్రశంసల వర్షం అనేది కురిపించింది.

Advertisement

Visitors Are Also Reading