Home » దేశంలో బీజేపీ ప్రభావం తగ్గుతోంది.. సీఎం కేసీఆర్ కీల‌క‌ వ్యాఖ్యలు

దేశంలో బీజేపీ ప్రభావం తగ్గుతోంది.. సీఎం కేసీఆర్ కీల‌క‌ వ్యాఖ్యలు

by Anji
Ad

దేశ‌వ్యాప్తంగా కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై పెద్ద చ‌ర్చ సాగుతోంది. ద‌ర్శ‌కుడు వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రి రూపొందించిన ఈ సినిమా లో కాశ్మీర్ పండిట్ల నేతలు వివరించే ప్రయత్నం చేశారు. ఈ సినిమాపై ప్రశంసలతో పాటుగా విమర్శలు కూడా అదే స్థాయిలో వినిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ సినిమా గురించి మాట్లాడారు. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ ఎల్పీ భేటి జరిగింది. ఇందులో కాశ్మీర్ ఫైల్స్ సినిమా పై మండిపడ్డారు కేసీఆర్. దేశంలో ఉన్న ప్రస్తుత సమస్యను పక్కదారి పట్టించడానికి ఈ సినిమా విడుదల చేశారని దేశానికి కావలసింది క‌శ్మీర్ ఫైల్స్ కాదని డెవలప్మెంట్ ఫైల్స్ అని సూచించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. కాశ్మీర్లో హిందూ పండిట్ల‌ను చంపినప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలో లేదా అని కేసీఆర్ ప్రశ్నించారు. రైతుల సమస్యలు పక్కదారి పట్టించేందుకే ఈ సినిమాను తెరపైకి తెచ్చారని అన్నారు కేసీఆర్. సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం తెలంగాణ భవన్ జరిగింది.

Advertisement

cm kcr

cm kcr

రేపు తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీ వెళ్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ఆహారశాఖ మంత్రిని కలిసి సమస్యల గురించి వివరిస్త అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం, సీట్లు తగ్గాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభావం తగ్గుతుందని పేర్కొన్నారు. యూపీలో బీజేపీకి 50 సీట్లు ఎందుకు తగ్గాయో ఆలోచించాలన్నారు. ఉత్తరాఖండ్‌లో సీట్లు, ఓట్లు తగ్గాయని.. పంజాబ్‌లో బీజేపీ ని తరిమికొట్టారంటూ పేర్కొన్నారు. కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై కూడా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఓట్ల కోసమే సినిమాను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఏం చేయడం లేదని అందరికీ తెలిసిపోయిందన్నారు.

Advertisement

యూపీలో బేజీపీ బలం తగ్గుతుందని గతంలోనే చెప్పానని.. గతంలో 312కు గాను 255 స్థానాలకు బీజేపీ పరిమితమైందిసీట్లు తగ్గడం దేనికి సంకేతమో ఆ పార్టీ ఆలోచించుకోవాలని సీఎం సూచించారు. బీజేపీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోందని.. ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమలు తీసుకురాలేదన్నారు. దేశం బాగుపడాలంటే బీజేపీని గద్దె దించాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. యూపీఏ పాలన సరిగా లేదని ప్రజలు బీజేపీకి అధికారం ఇచ్చారని.. కానీ బీజేపీ మరింత అధ్వాన పాలన సాగిస్తోంద్నారు. ప్రభుత్వరంగ సంస్థలను తాబేదార్లకు చౌకగా కట్టబెడుతున్నారన్నారు. ఏ రంగంలో దేశం అభివృద్ధి చెందిందో చెప్పాలంటూ సూచించారు.

Also Read :  వైసీపీ నేత‌ల‌తో బాల‌య్య పీఏ పేకాట‌.. అదుపులోకి తీసుకున్న క‌ర్ణాట‌క పోలీసులు

Visitors Are Also Reading