Home » Alekhya Reddy:తారకరత్న పోయి 3నెళ్లు కాలేదు..అలేఖ్య రెడ్డి 2 పెళ్లిపై క్లారిటీ..!!

Alekhya Reddy:తారకరత్న పోయి 3నెళ్లు కాలేదు..అలేఖ్య రెడ్డి 2 పెళ్లిపై క్లారిటీ..!!

Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన స్టార్ హీరోగా కూడా ఎదగకముందే ఒక రికార్డు మాత్రం తన సొంతం చేసుకున్నాడు. ఒకేసారి 9 సినిమాలతో ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి తారకరత్న ప్రపంచ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులకెక్కారు. అలాంటి నందమూరి తారకరత్న గారు కొన్ని సినిమాల్లో చేసిన కలిసి రాలేదు. అలా ఇండస్ట్రీకి దూరమై ఆ తర్వాత విలన్ గా కొన్ని పాత్రలు చేసి అవి కూడా కలిసి రాకపోవడంతో పూర్తిగా సినిమాలకు పుల్ స్టాప్ పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

also read:అప్పులపాలైన బెల్లంకొండ ను మళ్ళీ నిలబెట్టిన ఒకే ఒక్క సినిమా ఏదో తెలుసా…?

Advertisement

ఇక రాజకీయాల్లో క్రియాశీలకంగా రాణిద్దామని లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటు కు గురై 23 రోజులపాటు బెంగళూరులో హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చివరికి ఫిబ్రవరి 17 శివరాత్రి రోజున ప్రాణాలు విడిచారు. ఈయన మరణంతో నందమూరి కుటుంబంలో విషాద ఛాయాలలుముకున్నాయి. ఈయన మరణ వార్త ఇప్పటికి కూడా అలేఖ్య రెడ్డి జీర్ణించుకోలేకపోతోంది. ప్రతిసారి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు పెడుతూ కన్నీరు పెట్టుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అలేఖ్య రెడ్డి రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ అనేక వార్తలు వచ్చాయి.

Advertisement

also read:ఆ హీరోయిన్ వల్లే విజయ్ ఆంటోనీ బతికున్నాడని తెలుసా…ఆమె ఎవరంటే..?

అయితే రెండో పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ అవుతున్న నేపథ్యంలో అలేఖ్య రెడ్డి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అది ఏంటయ్యా అంటే .. ఈ జన్మకి నువ్వు నా భర్తవి..నా జీవితాంతం నీతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటాను. నా చివరి శ్వాస విడిచే వరకు నేను నీ భార్యనే, నా జీవితానికి నువ్వు చాలు.. అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది అలేఖ్య రెడ్డి. ఈ పోస్ట్ కాస్త వైరల్ అవ్వడంతో అలేఖ్య రెడ్డి రెండో పెళ్లి అంటూ ఫేక్ వార్త లు రాసిన వారికి క్లారిటీ వచ్చేసింది. ఆమె పోస్ట్ చదివిన కొంతమంది కావాలనే ఆకతాయిలు అలేఖ్య రెండో పెళ్లి ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.

also read:May 5th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Visitors Are Also Reading