Home » ఆ హీరోయిన్ వల్లే విజయ్ ఆంటోనీ బతికున్నాడని తెలుసా…ఆమె ఎవరంటే..?

ఆ హీరోయిన్ వల్లే విజయ్ ఆంటోనీ బతికున్నాడని తెలుసా…ఆమె ఎవరంటే..?

by AJAY
Ad

నటుడు విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయ్ 2016వ సంవత్సరంలో విడుదల అయినటువంటి బిచ్చగాడు మూవీతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల అయ్యి తెలుగు బాక్స్ దగ్గర అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.

Advertisement

ఇలా బిచ్చగాడు మూవీ సూపర్ సక్సెస్ సాధించడంతో ఈ మూవీకి సీక్వెల్ గా బిచ్చగాడు 2 అనే మూవీ ని రూపొందించారు. ఈ మూవీలో విజయ్ ఆంటోనీ హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీకి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీలో కావ్య తప్పర్ హీరోయిన్గా నటించింది. ఈ ముద్దుగుమ్మ ఇది వరకే ఎన్నో తెలుగు సినిమాలలో నటించింది. కావ్య నటించిన తెలుగు మూవీలలో ఏక్ మినీ కథ సినిమా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ మూవీని మే 19వ తేదీన భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Advertisement

ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన తెలుగు ప్రచార చిత్రాలను కూడా విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ హైదరాబాదులో ఒక ఈవెంట్ను నిర్వహించింది. ఈ ఈవెంట్ లో భాగంగా విజయ్ ఆంటోనీ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. ఈ మూవీ షూటింగ్లో భాగంగా నాకు ఒక భారీ యాక్సిడెంట్ జరిగేది అని… అందులో నుండి నన్ను ఈ సినిమాలో హీరోయిన్ అయినటువంటి కావ్య తప్పర్ తప్పించింది అని అందుకు తనకు ధన్యవాదాలు చెప్పుకొచ్చాడు.

Visitors Are Also Reading