Telugu News » Blog » May 5th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

May 5th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ads

హైదరాబాద్ పంజాగుట్ట వద్ద ఒంటిపై గాయాలతో బాలిక చనిపోయింది.అనుమానాస్పద స్థితిలో బాలిక మృతదే* లభ్యం అయ్యింది. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ దగ్గర ఫుట్ పాత్ పై పోలీసులు బాలికను గుర్తించారు.

Advertisement

తిరుమలలో మరోసారి భద్రతా వ్యవస్థ డొల్లతనం బయటపడింది. భక్తుల తనిఖీలో నిఘా సిబ్బంది వైఫల్యం బయటపడుతోంది. నిన్న రాత్రి శ్రీవారి ఆలయంలోకి మొబైల్ ఫోన్ తో భక్తుడు ప్రవేశించాడు. ఆనంద నిలయాన్ని అతి సమీపం నుంచి మొబైల్ ఫోన్ లో చిత్రీకరించాడు.

 

ధాన్యం సేకరణపై ముగియనున్న చంద్రబాబు అల్టిమేటమ్. సోమవారంలోపు తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే మంగళవారం నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బాబు అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

 

 

ఇవాళ సాయంత్రం బేగంపేట ఎయిర్ పోర్ట్ కి ప్రియాంక గాంధీ చేరుకుంటారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్, కోదండ రెడ్డి ఆమెకు స్వాగతం పలకనున్నారు. బేగంపేట నుండి నేరుగా హెలికాప్టర్ లో సరూర్ నగర్ స్టేడియంకు చేరుకుని చనిపోయిన 140 మంది కాంగ్రెస్ సభ్యుల కుటుంబాలకు చెక్కుల అందజేయనున్నారు.

 

మణిపూర్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల తరలింపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇంఫాల్ నుంచి కోల్‌కతా, హైదరాబాద్ లకు ప్రత్యేక విమానాలు వచ్చాయి. శంషాబాద్ నుంచి విద్యార్థుల స్వస్థలాలకు చేరేందుకు ప్రత్యేకంగా ఏపీఎస్ఆర్‌టీసీ బస్సులను ఏర్పాటు చేసింది.

 

మణిపూర్ లో సివిల్ వార్ నడుస్తుంటే బెంగళూరులో పీఎం మోడీ రోడ్ షో చేస్తున్నారని అసదుద్దీన్ ఎద్దేవా చేశారు. కేరళ స్టోరీ సినిమా ప్రమోషన్ కోసం బెంగళూరులో ప్రధాని రోడ్ షో చేస్తున్నారని అన్నారు.

 

హైదరాబాద్ లో నకిలీ కరెన్సీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టయ్యింది. భారీగా నకిలీ కరెన్సీ, సర్టిఫికెట్లను సైబరాబాద్ SOT పోలీసులు గుర్తించారు. నకిలీ కరెన్సీ సర్టిఫికెట్లు తయారుచేస్తున్న కేటుగాన్ని అరెస్ట్ చేశారు.

 

హైదరాబాద్ NTR శతజయంతి ఉత్సవాల సందర్భంగా మాసబ్ ట్యాంక్ వద్ద గల ఖాజా మెన్షన్ ఫంక్షన్ హాల్ లో మినీ మహానాడు నిర్వహిస్తున్నారు. ఉదయం 10గంటల నుండి మినీ మహానాడు జరగనుంది. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొననున్నారు.

 

Advertisement

తూర్పుగోదావరి జిల్లాలో లోన్ యాప్ ల వేధింపులకు కడియంకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి హరికృష్ణ (18) ఆత్మహ* చేసుకున్నారు. తీసుకున్న రుణం చెల్లించినా బెదిరింపులు తగ్గక పోవడం తో ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

You may also like