Home » టాలీవుడ్ లో మరో విషాదం, గుండెపోటుతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి

టాలీవుడ్ లో మరో విషాదం, గుండెపోటుతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి

by Bunty
Ad

నందమూరి తారకరత్న ఇప్పటికే ఆయన మరణం ప్రతి ఒక్క అభిమానిని కుటుంబ సభ్యులను కన్నీటి పర్యాంతం చేస్తూనే ఉంది. బ్రతుకుతాడని ప్రతి ఒక్కరు భావించారు. కానీ ఆయన అనూహ్యంగా మృతి చెందడం జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటి తారకరత్న యువగలం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురై నారాయణ హృదయాలయ ఆసపత్రిలో 23 రోజులు చికిత్స పొంది సరిగ్గా శివరాత్రి పర్వదినాన పరమపదించారు.

READ ALSO : తెలంగాణ SI,కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. మార్చి 11న

Advertisement

అయితే, తారకరత్న మరణం మరువకముందే టాలీవుడ్ లో మరొకరు గుండెపోటుతో కన్నుమూశారు. టాలీవుడ్ లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోలు ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2017లో విడుదలైన ‘దర్శకుడు’ మూవీకి ప్రవీణ్ అనుమోలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.

Advertisement

READ ALSO : Director Sagar Passed Away : టాలీవుడ్‌కు వరుస విషాదాలు.. సీనియర్ దర్శకుడు సాగర్ కన్నుమూత..

జక్కా హరిప్రసాద్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో అశోక్ బండ్రెడ్డి హీరోగా నటించగా, ఈషా రెబ్బ, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. సుకుమార్ నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత బాజీరావు మస్తానీ, ధూమ్ 3, బేబీ, పంజా, యమదొంగ చిత్రాలకు అసిస్టెంట్ కెమెరామెన్ గా కూడా ప్రవీణ్ పనిచేశారు. అతి చిన్న వయసులోనే ప్రవీణ్ గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు.

READ ALSO : రుద్రాక్ష మాలను ధరిస్తున్నారా…? అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి.

Visitors Are Also Reading