Telugu News » Blog » తెలంగాణ SI,కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. మార్చి 11న

తెలంగాణ SI,కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. మార్చి 11న

by Bunty
Ads

తెలంగాణ SI,కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణలో 19,969 ఎస్సై, పోలీస్ కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో ప్రిలిమినరీ పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సాంకేతిక విభాగాలకు సంబంధించిన తుది రాతపరీక్షలు మార్చి 11న జరగనున్నట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Read Also : అన్న కొడుకు కోసం బాలయ్య తపన.. కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి

హైదరాబాద్ పరిధిలోని పరీక్షా కేంద్రాల్లో మెయిన్స్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం ఎస్సై తుది రాతపరీక్ష 11వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్ఐ తుది రాతపరీక్ష అదేరోజు మధ్యాహ్నం 2:30 నిమిషాల నుంచి సాయంత్రం 5:30 నిమిషాల వరకు జరగనున్నట్లు తెలిపింది.

Advertisement

read also : Amigos OTT Release: కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మార్చి 6వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 9వ తేదీ రాత్రి 12 గంటల వరకు టిఎస్ఎల్పిఆర్బి అధికారిక వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు సూచించారు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పాస్ పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలని, హాల్ టికెట్ డౌన్లోడ్ లో ఇబ్బందులు ఎదురైతే 93937 11110 లేదా 93910 05006 నంబర్లను సంప్రదించాలన్నారు.

Advertisement

READ ALSO : మార్చి 6 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే

You may also like