Home » చంద్రబాబు విచారణకు సహకరించలేదు.. కస్టడీ విషయంలో కీలక విషయాలు వెల్లడించిన సీఐడీ..!

చంద్రబాబు విచారణకు సహకరించలేదు.. కస్టడీ విషయంలో కీలక విషయాలు వెల్లడించిన సీఐడీ..!

by Anji
Ad

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఆంధ్రప్రదేశ్  మాజీ  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మరో 5 రోజులు కస్టడికీ ఇవ్వాలని ఏపీ సీఐడీ అధికారులు కోరారు. ఈ క్రమంలో న్యాయస్థానానికి కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కస్టడీ పిటిషన్ లో చంద్రబాబు విచారణకు సంబంధించి కీలక విషయాలను సీఐడీ అధికారులు వెల్లడించారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. రెండు రోజులే ఇచ్చారని.. మరో మూడు రోజులు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. కస్టడీలో చంద్రబాబు విచారణకు ఏమాత్రం సహకరించలేదని తెలిపారు. కస్టడీకి ఆర్డర్స్ చూపే వరకు సమాధానం చెప్పనని మొండికేశారన్నారు. తొలి రోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆర్డర్ కాపీ చదవడంతోనే గడిపేశారని..  లంచ్ బ్రేక్ తర్వాత కూడా అదే తంతు కొనసాగించినట్టు  వెల్లడించారు.


విచారణకు రెండు రోజులు మాత్రమే సమయం ఉందని.. విచారణాధికారి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని సీఐడీ అధికారులు తెలిపారు. విచారణాధికారిని ప్రశ్నలు అడగనివ్వలేదన్నారు. తాను చెప్పదలుచుకున్నదే చంద్రబాబు చెప్పుకుంటూ పోయారని.. ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకు పొంతన లేని సమాధానాలు చెప్పినట్టు వివరించారు. కావాలని చంద్రబాబు కాలయాపన చేశారని చెప్పుకొచ్చారు. మాజీ సీఎం హోదాను అడ్డుపెట్టుకొని అధికారులను దబాయించినట్లు పిటిషన్ లో అధికారులు పేర్కొన్నారు. నిందితుల స్టేట్ మెంట్లపై చంద్రబాబు ప్రశ్నలు అడగనివ్వలేదని చెప్పుకొచ్చారు.

Advertisement

Advertisement


ఈ కేసులో నిందితులైన కన్వేల్కర్, లక్ష్మి నారాయణ, సుబ్బారావు స్టేట్ మెంట్లపై చంద్రబాబు సమాధానాలు దాట వేశారని అధికారులు  తెలిపారు. బాబు కాలయాపన చేసిన ప్రక్రియను వీడియో రికార్డ్ కూడా చేసినట్టు అధికారులు  వెల్లడించారు. 15 రోజుల్లోపే కస్టడీ విచారణ ఉంటుందనే నిబంధనను.. తనకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేశారన్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు విచారణ అడ్డుకున్నారని ఏపీ సీఐడీ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున కూడా విచారణ జరగాలని పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తరపు లాయర్ ను జడ్జీ ఇవాళ మందలించాడు. కస్టడీ పూర్తయిన తరువాతనే బెయిల్ పిటిషన్ అని సీఐడీ తరపు న్యాయవాదులు కోరగా.. బెయిల్ తరువాతనే కస్టడీ అని చంద్రబాబు తరపు లాయర్లు వాదించడంతో జడ్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో  కేసును రేపటికి వాయిదా వేశారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

బాలయ్య లయన్ బ్యాగ్ ఖరీదు ఎంతో తెలుసా ?

ఆ టైం లో ఈ జీవితాన్ని వద్దనుకున్నా.. కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్..!

Visitors Are Also Reading