Home » గాడ్ ఫాద‌ర్ లో పూరి జ‌గ‌న్నాథ్ న‌టించాడ‌ని చెప్పిన చిరు..!

గాడ్ ఫాద‌ర్ లో పూరి జ‌గ‌న్నాథ్ న‌టించాడ‌ని చెప్పిన చిరు..!

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాద‌ర్ సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి మోహ‌న్ రాజా ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ద‌స‌రా సంద‌ర్బంగా అక్టోబ‌ర్ 05న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్, థ‌క్క‌ర్ మార్ సాంగ్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఎన్వీ ప్ర‌సాద్‌-ఆర్‌బీ చౌద‌రి నిర్మించిన ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందించారు. ఇటీవ‌లే సెన్సార్ కూడా పూర్తి చేస్తుంది. U/A స‌ర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు.


ఈ చిత్రం నుంచి మెగాస్టార్ నుంచి వ‌దులుతున్న మెగాస్టార్ పోస్ట‌ర్లు అంత‌కంత‌కూ అంచ‌నాలు పెంచుతున్నాయి. ఈ సినిమాలో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార చిరంజీవి కి చెల్లెలు పాత్ర‌లో న‌టించింది. ఈ చిత్రం ప్ర‌మోష‌న్‌ల‌లో భాగంగా మెగాస్టార్ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ త‌రుణంలో సినిమా గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు చిరంజీవి. గాడ్ ఫాద‌ర్ సినిమాలో ద‌ర్శ‌కుడు పూరిజ‌గ‌న్నాథ్ న‌టిస్తున్నార‌ని చెప్పారు. ఒక యూ ట్యూబ‌ర్ పాత్ర‌లో పూరి జ‌గ‌న్నాథ్ క‌నిపించ‌నున్నాడ‌ట‌. తొలుత క‌థ విన్న‌ప్పుడు ఆ పాత్ర‌లో పూరి అయితేనే క‌రెక్ట్ అని భావించాం. అంత‌కు ముందు సోష‌ల్ మీడియాలో పూరి జ‌గ‌న్నాథ్ పాడ్ కాస్ట్‌ని విన్నాన‌ని, చాలా న‌చ్చ‌డంతో ఈ పాత్ర చెప్ప‌గానే పూరీ అయితే క‌రెక్ట్ అని అనుకున్న‌ట్టు చెప్పారు చిరు.

Advertisement

Advertisement

Also Read :  ఒకే ఒక జీవితం డిజిట‌ల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?


ఈ విష‌యం చెప్ప‌గానే నేను చేయ‌ను అని చెప్పాడు పూరి. కెమెరా వెను ఉండే నేను న‌టించ‌డం అది కూడా మీ ముందు నావ‌ల్ల కాద‌న్నారు. నేనే ప‌ట్టుబ‌ట్టి అత‌న్ని ఒప్పించాను అని చెప్పాడు చిరు. షూటింగ్ స‌మయంలో వ‌ణికిపోయాడ‌ని.. ఆ త‌రువాత చాలా అద్భుతంగా న‌టించి మెప్పించాడ‌ని చిరు పేర్కొన్నారు. చిరు చేసిన ఈ కామెంట్స్ సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం తెగ వైర‌ల్ అవుతున్నాయి. గాడ్ ఫాద‌ర్ సినిమా విడుద‌ల కంటే ముందే త‌న బాస్ ఇజాన్ని .. త‌న క్రేజ్‌ను మ‌రోసారి అంద‌రికీ దిమ్మ‌తిరిగేలా చూపించ‌బోతున్నారు చిరంజీవి. అనంత‌పురంలో గాడ్ ఫాద‌ర్ పేరును మారు మ్రోగించ‌నున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబ‌ర్ 28న అనంత‌పూర్‌లో నిర్వ‌హించ‌నున్నారు. ఇప్ప‌టి నుంచే అనంత‌పూర్ ప్ర‌భుత్వ క‌ళాశాల గ్రౌండ్‌లో ఏర్పాట్లు ప్రారంభించారు.

Also Read :  హీరోయిన్ కాకుండా ఉంటే నిధి అగ‌ర్వాల్ ఏం చేసేదో తెలుసా..?

 

Visitors Are Also Reading