Home » ఒకే ఒక జీవితం డిజిట‌ల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ఒకే ఒక జీవితం డిజిట‌ల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

by Anji
Ad

యంగ్ అండ్ టాలెంటెడ్‌ హీరో శ‌ర్వానంద్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆయ‌న వ‌రుస‌గా ఆరు ఫ్లాప్ సినిమాల త‌రువాత ఒకే జీవితం సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. నూతన ద‌ర్శ‌కుడు శ్రీ‌కార్తిక్ తెర‌కెక్కించిన ఈ సినిమాలో రీతూవ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. అక్కినేని అమ‌ల కీల‌క పాత్ర‌లో క‌నిపించింది. ఎలాంటి అచంనాలు లేకుండా సెప్టెంబ‌ర్ 16న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది.

Advertisement

ప్ర‌ధానంగా టైం ట్రావెల్ నేప‌థ్యానికి మ‌ద‌ర్ సెంటిమెంట్ జోడింకి శ్రీ‌కార్తిక్ ఈ సినిమాను తెర‌కెక్కించిన విధానం ప్రతీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంది. శ‌ర్వానంద్‌-అమ‌ల న‌ట‌న‌కు అంర‌దూ ఫిదా అవుతున్నారు. ఈ త‌రుణంలో థియేట‌ర్ల‌లో మంచి విజ‌యం సాధించిన ఈ చిత్రం త్వ‌ర‌లోనే డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్ లో ప్ర‌సారం కానుంది. ఇక ఈచిత్రం డిజిట‌ల్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలీవ్ కైవ‌సం చేసుకుంది.

Advertisement

Also Read :  రాఘ‌వేంద్ర‌రావు కొడుకు కూడా హీరోగా సినిమాలు చేశాడ‌ని తెలుసా..? కానీ సినిమాల‌కు ఎందుకు గుడ్ బై చెప్పాడంటే..?

 

ఈ సినిమా కోసం సోనీలీవ్ దాదాపు రూ.15కోట్ల వ‌ర‌కు చెల్లించిన‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే నెల అంటే అక్టోబ‌ర్ రెండో వారంలో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవ‌కాశాలున్నాయి. అతి త్వ‌ర‌లోనే ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంద‌ని స‌మాచారం. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ తెర‌కెక్కించిన ఈ చిత్రం త‌మిళంలో క‌ణం పేరుతో విడుద‌ల అయింది. సైన్స్ ఫిక్ష‌న్ ఎమోష‌న‌ల్ డ్రామాగా ఆక‌ట్టుకుంటున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి, నాజ‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. జేక్స్ బిజోయ్ స్వ‌రాలు స‌మ‌కూర్చ‌గా అమ్మ‌పాట బాగా హిట్ అయింది.

 Also Read : ఆ ఒక్క కండిష‌న్ తో దూకుడు లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ను శ్రీహ‌రి మిస్ చేసుకున్నాడ‌ని తెలుసా..? ఆ కండిష‌న్ ఏంటంటే.?

Visitors Are Also Reading