Home » ఎన్టీఆర్ కి బయపడి వాయిదా వేసుకున్న చిరు సినిమా అదే అని తెలుసా ?

ఎన్టీఆర్ కి బయపడి వాయిదా వేసుకున్న చిరు సినిమా అదే అని తెలుసా ?

by AJAY
Ad

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ రీఎంట్రీ తో కుర్ర హీరోల‌కు పోటీ ఇస్తున్నారు. వ‌రుస సినిమాల‌ను లైన్ లో పెడుతూ గ్యాప్ లేకుండా ప‌ట్టాలెక్కిస్త‌న్నారు. అంతే కాకుండా విభిన్న క‌థ‌ల‌తో యంగ్ డైరెక్ట‌ర్ ల‌తో మెగాస్టార్ సినిమాలు చేస్తున్నారు. మెగాస్టార్ న‌టించిన ఆచార్య సినిమా విడుద‌లకు సిద్దంగా ఉంది. ఇదిలా ఉండ‌గానే లూసీఫ‌ర్ రీమేక్ షూటింగ్ ద‌శ‌లో ఉంది. దాంతో పాటూ మ‌రికొన్ని సినిమాల‌కు మెగాస్టార్ ఇప్ప‌టికే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

Advertisement

 

ఇక చిరు సినిమా వ‌స్తుందంటే ఎంతటి పెద్ద స్టార్ అయినా త‌మ సినిమాను వాయిదా వేసుకుంటార‌న్న సంగ‌తి తెలిసిందే. అందుకు కార‌ణం చిరు స్టార్ హీరో ఆయ‌నకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మ‌హిళ‌లు కూడా చిరు సినిమాల‌ను ఇష్ట‌ప‌డతారు. కానీ మెగాస్టార్ ఒకానొక సంధ‌ర్బంలో త‌న సినిమాను యంగ్ హీరో కోసం వాయిదా వేసుకున్నారు. ఆ హీరో మ‌రెవ‌రో కాదు..యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. స‌రిగ్గా పంతొమ్మిదేళ్ల కింద‌ట ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

Advertisement

ఎన్టీఆర్ ఆది సినిమాతో మాస్ హిట్ ను అందున్నారు. ఈ సినిమా త‌ర‌వాత ఎన్టీఆర్ క్రేజ్ ఎక్క‌డ‌కో వెళ్లిపోయింది. ఇక ఈ సినిమా త‌ర‌వాత ఎన్టీఆర్ బి గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో అల్ల‌రి రాముడు అనే సినిమాలో న‌టించారు. సినిమాలో ఆర్తి అగ‌ర్వాల్ ఎన్టీఆర్ కు జోడీగా న‌టించింది. అదే స‌మ‌యంలో బి.గోపాల్ చిరంజీవి హీరోగా ఇంద్ర సినిమాను పూర్తి చేసాడు. ఇక ఈ రెండు సినిమాల‌ను జూలై 18న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావించారు.

కానీ ఒక‌వేళ ఇంద్ర ఫ్లాప్ అయ్యి అల్ల‌రి రాముడు హిట్ అయితే చిరంజీవి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంద‌ని ఆలోచించారు. దాంతో ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నారు. అప్పటికే చిరు మంజునాథ‌, మృగ‌రాజు, డాడీ లాంటి వ‌రుస ఫ్లాప్ ల‌ను అందుకున్నాడు. ఈ నేప‌థ్యంలోనే చిరు సినిమా ఇంద్ర‌ను ఓ వారం రోజుల పాటూ వాయిదా వేసుకుని జూలై 24వ తేదీన విడుద‌ల చేశారు. కానీ నిర్మాత‌లు అనుకున్నదానికి భిన్నంగా జ‌రిగింది. అల్ల‌రి రాముడు ఫ్లాప్ అవ్వ‌గా ఇంద్ర రికార్డులు క్రియేట్ చేసింది.

ALSO READ :

కేజీఎఫ్-2 ఇనాయత్ కలీల్ ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ తండ్రి అన్న సంగతి తెలుసా…!

సీరియల్ నుండి సలార్ వరకు… ఈశ్వరి రావు ఎవరు ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి…?

Visitors Are Also Reading