Home » కేజీఎఫ్-2 ఇనాయత్ కలీల్ ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ తండ్రి అన్న సంగతి తెలుసా…!

కేజీఎఫ్-2 ఇనాయత్ కలీల్ ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ తండ్రి అన్న సంగతి తెలుసా…!

by AJAY
Ad

ఆదర్శ్ బాలకృష్ణ టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు. ఆదర్శ్ విలన్ రోల్స్ తో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. హ్యాపీడేస్, గోవిందుడు అందరివాడేలే, అరవింద సమేత లాంటి సినిమాల్లో నెగటివ్ పాత్రలలో కనిపించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆదర్శ రంగమార్తాండ అనే సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.

Advertisement

 

కేవలం సినిమాలతోనే కాకుండా ఆదర్శ్ బిగ్ బాస్ సీజన్ 1 లో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. అంతేకాకుండా ఈ సీజన్ లో రెండో స్థానంలో నిలిచాడు. ఆదర్శ్ తన నిజాయితీ ఆటిట్యూడ్ తో బిగ్ బాస్ ద్వారా చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

Advertisement

ఇదిలా ఉంటే ఆదర్శ్ బాలక్రిష్ణ తండ్రి కూడా నటుడు అన్న సంగతి చాలా మందికి తెలియదు. అంతేకాకుండా రీసెంట్ గా విడుదలయిన కేజిఎఫ్ 2 సినిమాలో ఆదర్శ్ తండ్రి ముఖ్యమైన పాత్రలో ఇనాయత్ కలీల్ అనే పాత్ర ఎంతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

కాగా ఈ పాత్ర లో నటించిన నటుడే ఆదర్శ్ తండ్రి బాలకృష్ణ. అంతే కాకుండా కేజీఎఫ్ 2 తో బాలకృష్ణ పాన్ ఇండియా కి పరిచయం అయ్యారు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ ఆదర్శ్ తండ్రి అని తెలియడంతో తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్య పోతున్నారు. ఇదిలా ఉండగా కేజీఎఫ్ 2 రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కు కలెక్షన్ ల వర్షం కురుస్తోంది.

Also read : సీరియల్ నుండి సలార్ వరకు… ఈశ్వరి రావు ఎవరు ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి…?

 

Visitors Are Also Reading