Home » సీరియల్ నుండి సలార్ వరకు… ఈశ్వరి రావు ఎవరు ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి…?

సీరియల్ నుండి సలార్ వరకు… ఈశ్వరి రావు ఎవరు ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి…?

by AJAY
Ad

ఒకప్పుడు హీరోయిన్ గా మెప్పించిన వారు ప్రస్తుతం తల్లి, సోదరి, వదిన మరియు ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. అలా ఒకప్పుడు హీరోయిన్ గా నటించి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న వారిలో ఈశ్వరి రావు కూడా ఒకరు. 1990- 1999 మధ్యకాలంలో ఈశ్వరరావు హీరోయిన్ గా అనేక సినిమాలు చేశారు.

Advertisement

తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించారు. రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన రాంబంటు సినిమాలో కూడా ఈశ్వరీ రావు హీరోయిన్ గా నటించి అలరించారు. ఈ సినిమాలో ఈశ్వరీరావు పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఇక 2000 సంవత్సరం నుండి ఈశ్వరీరావు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అనేక సినిమాలు చేశారు.

Advertisement

కేవలం సినిమాలు మాత్రమే కాకుండా సీరియల్స్ లో కూడా నటించారు. తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన “నిన్నే పెళ్లాడతా” సీరియల్ లో ఈశ్వరరావు ముఖ్యమైన పాత్రలో నటించారు. రీసెంట్ గా నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమాలో నాగచైతన్య కు తల్లిగా నటించి ఆకట్టుకున్నారు. అదేవిధంగా కాలా సినిమా లో రజనీకాంత్ హీరోగా నటించగా ముఖ్యమైన పాత్రలో ఈశ్వరి రావు నటించి ప్రేక్షకులను అలరించారు. ఇక రీసెంట్ గా కేజిఎఫ్ 2 సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాలో కూడా ఈశ్వరిరావు నటించారు. ఈ సినిమాతో పాన్ ఇండియాకు ఆమె పరిచయమయ్యారు. అంతే కాకుండా ఈ సినిమా లో ఆమె నటన చూసి ఆశ్చర్యపోయిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆమెకు మరో గొప్ప అవకాశం ఇచ్చారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో ప్రభాస్ కు తల్లిగా ఈశ్వరరావు నటిస్తున్నారు. మరి ఈ సినిమా మా ఈశ్వరీరావు కు ఎలాంటి సక్సెస్ ను ఇస్తుందో చూడాలి.

ALSO READ : 

నెట్టింట వైరల్ అవుతున్న చంద్రబాబు పెళ్లి పత్రిక…ఎన్టీఆర్ ఎంత కట్నం ఇచ్చారంటే..!

“ఆచార్య” క‌థ బాల‌య్య కోసం రాసిందా..? ఇదెక్క‌డి ట్విస్ట్ రా బాబూ…!

Visitors Are Also Reading