Home » Bholaa Shankar Teaser : హద్దుల్లేవ్.. సరిహద్దుల్లేవ్.. చిరు మాస్ డైలాగ్స్ మామూలుగా లేవుగా..!

Bholaa Shankar Teaser : హద్దుల్లేవ్.. సరిహద్దుల్లేవ్.. చిరు మాస్ డైలాగ్స్ మామూలుగా లేవుగా..!

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వాల్తేరు వీరయ్య తో మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. తాజాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం బోళాశంకర్. మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గత కొద్ది నెలలుగా ఈ సినిమా షూటింగు శరవేగంగా జరుపుకుంటుంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్ సింగిల్ ప్రోమో ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా నుంచి ఇంతకుముందు రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా చిత్త యూనిట్ బోలా శంకర్ విడుదల చేసింది.

Advertisement

విడుదలైన ఈ టీజర్ ఆద్యంత యాక్షన్ కం సిస్టర్ సెంటిమెంటుతో కొనసాగుతోంది. ఎప్పటిలాగే ఈ సినిమాలో చిరుమార్కు కామెడీతో పాటు మాస్ యాక్షన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం 33 మందిని చంపేశాడు ఒక్కడు.. ఏ కాకి.. హౌ..? కోన్ హై తూ..? డైలాగుతో టీజర్ ప్రారంభం అవుతుంది. విలను ప్రశ్నకు చిరుతన మేనరిజంలో ఆన్సర్ చెప్పాడు. షికారుకు వచ్చిన షేర్ ను బే అంటూ మాస్ డైలాగ్ పలికాడు. ఈ టీజర్ లో కీర్తి సురేష్ తమన్నా సుశాంత్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. చివరిలో.. ఈ స్టేట్ డివైడ్ అయినప్పటికీ అందరూ నావాళ్లే.. ఆల్ ఏరియా నాకు హద్దులు లేవు సరిహద్దులు లేవు అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది.

Advertisement

ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మెహర్ రమేష్ తొలిసారిగా చిరంజీవితో సినిమా చేస్తున్నారు. దాదాపు 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకు ఒక్క హిట్టు కూడా అందుకొని మెహర్ రమేష్ ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్టు అందుకునేందుకు భారీగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ నుంచి కొద్దిరోజుగా చిరు లీగ్స్ అంటూ షూటింగుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తున్నారు చిరంజీవి. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 11న బోలాశంకర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

విడాకుల విషయంలో సమంతదే తప్పు అని అమల తేల్చేసిందా..? 

పవన్ కళ్యాణ్ వదులుకున్న సినిమాలు చేసి…స్టార్లు అయిన హీరోలు ?

Visitors Are Also Reading