Home » ‘ఒకే ఒక్కడు’ సినిమాని వదులుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?

‘ఒకే ఒక్కడు’ సినిమాని వదులుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?

by Bunty
Ad

ఒకప్పటి స్టార్ హీరో అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలలో హీరోగా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా హీరోయిన్స్ కు అన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే అర్జున్ కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ‘ఒకే ఒక్కడు’ సినిమా మాత్రం ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

Advertisement

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ లో కూడా ఈ సినిమా రిలీజ్ చేయగా… బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 30 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమాలో మొదటగా తమిళ్లో అర్జున్ తో…తెలుగులో చిరంజీవితో చేయాలని డైరెక్టర్ శంకర్ అనుకున్నారట. ఈ విషయాన్ని చిరంజీవితో కూడా శంకర్ చెప్పారట. ఈ ప్రాజెక్టుకు చిరంజీవి కూడా ఓకే చెప్పారట. కానీ ఈ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవికి డేట్స్ కుదరకపోవడంతో ఈ ప్రాజెక్టు చిరంజీవి చేతుల నుంచి జారిపోయింది.

Advertisement

ఇక ఈ సినిమాలో హీరోగా చిరంజీవి స్థానంలో అర్జున్ ను ఫిక్స్ చేశారట డైరెక్టర్ శంకర్. ఒకవేళ చిరంజీవి కనక ఈ సినిమా చేసి ఉంటే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యుండేదని శంకర్ అభిప్రాయపడ్డారట. ఇదే సినిమాను హిందీలో అనిల్ కపూర్ ను హీరోగా పెట్టి ‘నాయక్’ అనే సినిమాతో తెరకెక్కించారు. కానీ ఈ సినిమా బాలీవుడ్ వద్ద బోల్తా కొట్టింది. అక్కడ హిందీ ఆడియన్స్ కు ఈ సినిమా అంతగా నచ్చలేదు. దాంతో ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడున్నారు.. ఆమె ఆస్తులు ఎంతో తెలుసా ?

ఈ ప్లేస్ లలో పుట్టుమచ్చ ఉంటే.. మీకు అదృష్టం మాములుగా పట్టదు !

యూట్యూబర్ నెల ఆదాయం రూ. 30 లక్షలు.. నెంబర్ వన్ యూట్యూబర్ గా AP వాసి !

 

Visitors Are Also Reading