Home » యూట్యూబర్ నెల ఆదాయం రూ. 30 లక్షలు.. నెంబర్ వన్ యూట్యూబర్ గా AP వాసి !

యూట్యూబర్ నెల ఆదాయం రూ. 30 లక్షలు.. నెంబర్ వన్ యూట్యూబర్ గా AP వాసి !

by Bunty
Ad

ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ప్రదేశాన్ని చూసి తన సత్తా ఏంటో నిరూపించుకున్న తొలి భారతీయ వ్యక్తిగా మొదటి స్థానంలో నిలిచాడు. నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ తో ప్రపంచం మొత్తాన్ని చుట్టేస్తూ యూట్యూబర్ గా హిస్టరీని క్రియేట్ చేస్తున్నాడు. ఇతను మొదటగా ఒక బార్ అండ్ రెస్టారెంట్ లో జాబ్ చేసేవాడు.

Advertisement

కరోనా అనంతరం తన జాబ్ ను వదిలేసి యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేసి లక్షల్లో డబ్బులను సంపాదిస్తున్నాడు. యూట్యూబ్లో తనకు తానే సాటిగా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. తాజాగా చైనాలో పర్యటించిన అన్వేష్ ఒక్క నెలలో 30 లక్షల వరకు ఆదాయాన్ని సంపాదించినట్లు తన యూట్యూబ్ ఛానల్ లో వెల్లడించారు. ఇప్పటివరకు అన్వేష్ ఏడు ఖండాలు, 100కు పైగా దేశాలలో తిరిగిన తొలి భారతీయ ప్రయాణికుడిగా యూట్యూబర్ గా అన్వేష్ పేరును సంపాదించుకున్నాడు.

Advertisement

యూట్యూబ్లో ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఒక వీడియోను పోస్ట్ చేస్తూ లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. ప్రతి ఒక్క దేశాన్ని తను మాత్రమే కాకుండా తన వీడియోల రూపంలో ప్రతి ఒక్క భారతీయుడికి చూపిస్తున్నాడు. అక్కడ ఉండే ప్రదేశాలు, ఆ దేశాల గొప్పతనాన్ని తన మాటల రూపంలో ప్రతి ఒక్క ప్రేక్షకుడికి తెలియజేస్తాడు అన్వేష్. అక్కడ సాంప్రదాయాలు, రుచులు, కట్టుబాట్లను చాలా చక్కగా వివరిస్తాడు.

ఇవి కూడా చదవండి

యూట్యూబర్ నెల ఆదాయం రూ. 30 లక్షలు.. నెంబర్ వన్ యూట్యూబర్ గా AP వాసి !

అఖిల్ పుట్టాక అమల సంచలన నిర్ణయం.. నాగచైతన్య కోసమే ?

ఆస్పత్రిలో చేరిన బండ్ల గణేష్.. ఆందోళనలో ఫ్యాన్స్ ?

Visitors Are Also Reading