Home » భోళా శంకర్‌ కోసం ఒక్క రూపాయి తీసుకోని చిరంజీవి !

భోళా శంకర్‌ కోసం ఒక్క రూపాయి తీసుకోని చిరంజీవి !

by Bunty
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరస సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.  మెగాస్టార్ చిరంజీవి “భోళా శంకర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా రిలీజ్ అయినటువంటి ట్రైలర్ సినిమాపై మరింత హైప్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన గ్రాండ్ గా విడుదల కానుంది.

Advertisement

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. అదేంటంటే ఈ సినిమాలో నటించినందుకు చిరంజీవి ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదట. స్టార్ హీరో అయినటువంటి చిరంజీవి ప్రతి సినిమాలో నటించినందుకు భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటాడట. మరి ఈ సినిమాలో నటించినందుకు ఎందుకు రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు అని ఇండస్ట్రీలో ఈ విషయంపై టాక్ నడుస్తోంది.

Advertisement

అయితే ఈ సినిమాలో నటించినందుకు చిరంజీవి రెమ్యూనరేషన్ వద్దని చెప్పి ఆ సినిమా విడుదల అయ్యాక లాభాల్లో షేర్ కావాలని అడిగాడట. దానికి నిర్మాతలు కూడా సరే అని చెప్పారట. చిరంజీవి సినిమా కాబట్టి కలెక్షన్స్ భారీ స్థాయిలో ఉంటాయి. దీంతో రెమినరేషన్ కన్నా షేర్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాపై చిరంజీవికి కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అందుకే నిర్మాతలతో షేర్ గురించి డీల్ కుదుర్చుకున్నాడట. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను భారీ ధరకి అమ్ముడైనట్లు సమాచారం. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

శ్రీ లీల కారణంగానే రష్మిక స్టార్ హీరోయిన్ అయ్యిందా…!

BRO : “బ్రో” మూవీ ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. పవన్ ఫ్యాన్స్ కు ఇక పండగే

“నువ్వు నా కెరీర్ ముగించావు” విరాట్ కోహ్లీపై జహీర్ ఖాన్ సంచలనం !

Visitors Are Also Reading