మెగాస్టార్ చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య సినిమాలో నటించారు. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించారు. మైత్రీమూవీమేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిరు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చిరు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్ లు చేశారు.
Also Read: అల్లు ఫ్యామిలీతో గొడవలు…ఇరిటేషన్ వచ్చింది అంటూ చిరంజీవి ఓపెన్ కామెంట్స్..!
చిరంజీవి సొంత ఊరు మొగల్తూరు అన్న సంగతి తెలిసిందే. అయితే మొగల్తూరు లోని సొంత ఇంటిని చిరంజీవి అమ్ముకున్నారని అప్పట్లోప్రచారం జరిగింది. లైబ్రరీ కోసం చిరు ఇంటిని అడగ్గా ఆయన తన మేనేజర్ పై గుర్రుమన్నారని మూడు లక్షలకు ఇంటిని అమ్మేశారని ప్రచారం జరిగింది. కాగా తాజా ఇంటర్వ్యూలో చిరంజీవి ఆ ప్రచారం పై క్లారిటీ ఇచ్చారు. అసలు ఆ ఇల్లు తనది కాదని చెప్పారు.
తన మేనమామ శ్రీనివాస రావు ఇల్లు అని అన్నారు. ఆ ఇంటిపైన తనకు హక్కు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తన తల్లి అక్కడ ప్రసవించడం వల్ల అక్కడ జన్మించానని చెప్పారు. తాను అక్కడ చదువుకోవడం వల్ల చిరంజీవి ఇల్లు అంటారని తెలిపారు. ఆ ఇంటిని తన మేనమామ అమ్మేసుకుని వెళ్లిపోయాడని అన్నారు. అయినా అక్కడ లైబ్రరీ ప్రస్తావన రాకముందే తాను లైబ్రరీని కట్టించానని చెప్పారు. తన మేమ ఇంటిని లైబ్రరీ కోసం ఎందుకు ఇవ్వమని అడుగుతున్నారో తనకు అర్థం కావడం లేదని అన్నారు.
ALSO READ : Upasana Konidela : పుట్టబోయే బిడ్డ గురించి ఎమోషనల్ పోస్ట్ చేసిన ఉపాసన