Telugu News » Blog » Upasana Konidela : పుట్టబోయే బిడ్డ గురించి ఎమోషనల్‌ పోస్ట్‌ చేసిన ఉపాసన

Upasana Konidela : పుట్టబోయే బిడ్డ గురించి ఎమోషనల్‌ పోస్ట్‌ చేసిన ఉపాసన

by Bunty
Ads

భారత చలన చిత్ర పరిశ్రమలో మరో రికార్డు సొంతం చేసుకుంది ఆర్ఆర్ఆర్ చిత్రం. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రభంజనం మొదలైంది. నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఈ అవార్డు ప్రకటించిన వెంటనే ఆ హాల్ మొత్తం ఒక్కసారిగా కరతాళధ్వనులతో మారుమోగిపోయింది. అక్కడే ఉన్న ట్రిపుల్ ఆర్ టీం దీన్ని చూసి ఎంజాయ్ చేసింది. ట్రిపుల్ ఆర్ సాధించిన అవార్డు భారతీయ చలనచిత్ర రంగం సెలబ్రేట్ చేసుకుంది.

Advertisement

READ ALSO : Veera Simha Reddy Review in Telugu: “వీర సింహారెడ్డి” రివ్యూ..రికార్డులు బద్దలు కొడుతున్న బాలయ్య

 

చిత్ర యూనిట్ కు మెగాస్టార్ చిరంజీవి కంగ్రాట్స్ చెప్పారు. అపూర్వమైన విజయం సాధించిన ట్రిపుల్ ఆర్ టీంకు టేక్ ఏ బో అంటూ చిరు ట్వీట్ చేశారు. ఇటు అటు రామ్ చరణ్ వైపు ఉపాసన కూడా దీనిపై తన స్టైల్ లో స్పందించింది. తనకి పుట్టబోయే బిడ్డ గురించి మొదటిసారి ట్వీట్ చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెలా తాను ఎంతో భావోద్వేగానికి గురవుతున్నట్లు చెప్పింది.

రామ్ చరణ్ తో కలిసి గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్న ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఆర్ఆర్ఆర్ టీం తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ, ఆర్ఆర్ఆర్ టీం లో భాగమైనందుకు నాకెంతో ఆనందంగా ఉంది. దేశం గర్వించే విజయం ఇది. ఈ ప్రయాణంలో నేను భాగమయ్యేలా చేసినా రామ్ చరణ్ దర్శకుడు రాజమౌళికి ధన్యవాదాలు. నాతో కలిసి నా బేబీ కూడా ఈ అనుభూతిని పొందుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ క్షణాలు భావోద్వేగంగా అనిపిస్తున్నాయి, అని ఉప్సి పేర్కొంది. దీనిని చూసిన మెగా అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

READ ALSO : ఏపీ నిరుద్యోగులకు అలర్ట్‌.. కానిస్టేబుల్ హాల్ టికెట్లు విడుదల..ఇలా డౌన్‌ లోడ్‌ చేసుకోండి

Advertisement