Telugu News » Blog » అల్లు ఫ్యామిలీతో గొడ‌వ‌లు…ఇరిటేష‌న్ వ‌చ్చింది అంటూ చిరంజీవి ఓపెన్ కామెంట్స్..!

అల్లు ఫ్యామిలీతో గొడ‌వ‌లు…ఇరిటేష‌న్ వ‌చ్చింది అంటూ చిరంజీవి ఓపెన్ కామెంట్స్..!

by AJAY
Ads

చిరంజీవి హీరోగా న‌టించిన వాల్తేరు వీర‌య్య సినిమా ఈ నెల 13న విడుద‌ల కాబోతుంది. ఈ సినిమాకు బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా ట్రైల‌ర్ మ‌రియు పాటలు ఇప్ప‌టికే విడుద‌ల కాగా యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. అంతే కాకుండా చిరంజీవి వింటేజ్ మాస్ లుక్ లో క‌నిపిస్తున్నారు. సినిమా విడుద‌ల‌కు ముందే ఈ చిత్రం పై భారీ అంచనాలు నెల‌కొన్నాయి.

Advertisement

ఇక సినిమా విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో చిరు సినిమా ప్ర‌మోష‌న్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. వ‌రుస ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. కాగా తాజాగా ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. చిరంజీవికి ఇంట‌ర్వ్యూలో మెగా అల్లు ఫ్యామిలీల మ‌ధ్య దూరం గురించి ప్ర‌శ్న‌లు ఎదురయ్యాయి.

Advertisement

వాటి పై చిరు స్పందిస్తూ ప‌వ‌న్ క‌ల్యాణ్ రామ్ చ‌ర‌ణ్ ఎద‌గాల‌ని ఎలా కోరుకుంటానో అల్లు అర్జున్ ఎద‌గాల‌ని కూడా అలానే కోరుకుంటాన‌ని అన్నారు. అల్లు అర్జున్ ఎదుగుద‌ల చూసి తాను సంతోష‌ప‌డతాన‌ని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా బ‌న్నీ మాట్లాడిన ప్ర‌తిసారి త‌న గురించి మాట్లాడాల‌ని కోరుకోన‌ని అన్నారు.

ఇక పేరు ప్ర‌స్తావించ‌లేద‌ని త‌ర‌చూ వివాదాల‌ను తీసుకువస్తారు. ఆ వివాదాలు వింటే ఒక్కోసారి ఇరిటేష‌న్ వ‌స్తుంద‌ని చిరు వ్యాఖ్యానించారు. తాను ప్ర‌తిఒక్క‌రి ఎదుగుద‌ల‌ను చూసి సంతోషిస్తాన‌ని చెప్పారు. చిరు ఈ వ్యాఖ్య‌ల‌తో త‌న‌కు అల్లు ఫ్యామిలీతో ఎలాంటి గొడ‌వ‌లు లేవ‌ని స్ప‌ష్టం చేశారు. అంతే కాకుండా గ‌త కొద్దిరోజులుగా రెండు కుటుంబాల మ‌ధ్య గొడ‌వ‌లు ఉన్నాయ‌ని వ‌స్తున్న వార్త‌ల‌కు కూడా చెక్ పెట్టారు.

Advertisement

ALSO READ: CHIRANJEEVI : మెగాస్టార్ తన ఫోన్ లో సురేఖ, పవన్, చరణ్ పేర్లను ఏమని సేవ్ చేసుకున్నారో తెలుసా ?