Home » మెగాస్టార్ చిరంజీవి రిజెక్ట్ చేసిన 8 బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు ఇవే..!

మెగాస్టార్ చిరంజీవి రిజెక్ట్ చేసిన 8 బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు ఇవే..!

by Anji
Ad

హీరోగా మెగాస్టార్ చిరంజీవి దాదాపు 153 సినిమాలను చేశారు. వాటిలో ఎన్నో హిట్స్‌, మ‌రికొన్ని సినిమాలు డిజాస్ట‌ర్ హిట్స్, కొన్ని సినిమాలు ఫ్లాప్, కొన్ని ఇండస్ట్రీ హిట్ సాధించాయి. ఇంకా కొన్ని సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయి ఆగిపోగా.. కొన్ని సినిమాలు ఆగిపోగా.. మరికొన్ని సినిమాలను రకరకాల కారణాలతో ఆయనే వదులుకున్నారు. ఇప్పటివరకు చిరంజీవి ఎనిమిది సినిమాలను వదులుకున్నారు. వాటిలో ఒక్క సినిమా మాత్రమే ఫ్లాప్ అయ్యింది. ఒక సినిమా సెట్స్ మీద ఉంది. మిగ‌తా సినిమాలన్నీ హిట్. ఇప్పుడు అవి ఏమిటో మ‌నం తెలుసుకుందాం.

ఇవి కూడా చ‌ద‌వండి :  పవర్ ఫుల్ పాత్రకు కూడా నో చెప్పిన సాయి పల్లవి.. ఎందుకంటే..?

Advertisement

 

మ‌న్నెంలో మొన‌గాడు :

మొదటగా మ‌న్నెంలో మొన‌గాడు సినిమాను చిరంజీవి వ‌దులుకున్నారు. ద‌ర్శ‌కుడు కోడి రామకృష్ణ ఈ సినిమాను చిరంజీవితో చేయాల‌నుకున్నాడు. కానీ అప్ప‌టికే చిరంజీవికి స్టార్ హీరో ఇమేజ్ రావ‌డంతో ఆ పాత్ర త‌న‌కు సూట్ అవ్వ‌ద‌ని రిజెక్ట్ చేశాడు. అది యాక్ష‌న్ కింగ్ అర్జున్ చేతికి వెళ్లి సూప‌ర్ హిట్ అయింది.

ఆక‌రి పోరాటం :

మెగాస్టార్ చిరంజీవి-శ్రీ‌దేవిల క్రేజీ కాంబినేష‌న్ లో ఒక సినిమా వైజ‌యంతి మూవీస్ అధినేత అశ్వ‌నిద‌త్ నిర్మిద్దామ‌ని అనుకున్నారు. శ్రీ‌దేవి పాత్ర ఎక్కువ‌గా ఉండ‌డంతో పాటు త‌ను కూడా పుల్ బిజీగా ఉండ‌డంతో ఆ సినిమా వ‌దులుకున్నారు చిరు. త‌రువాత అది నాగార్జున చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించారు.

అసెంబ్లీ రౌడి :

తొలుత ఈ సినిమాని తెలుగులో చిరంజీవితో రీమెక్ చేద్దామ‌నుకున్నారు. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ కూడా చిరంజీవిని న‌టింప‌జేయాల‌ని అనుకున్నారు. కానీ రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న‌ద‌నో, లేక త‌న డేట్స్ ఖాళీగా లేక‌నో చిరంజీవి ఈ ఆఫ‌ర్‌ని తిర‌స్క‌రించాడు. ఆ త‌రువాత అది మోహ‌న్ బాబుని వ‌రించి ఆయ‌న కెరీర్‌ని మ‌లుపు తిప్పింది.

నెంబ‌ర్ వ‌న్ :

Advertisement

ఎస్వీ కృష్ణారెడ్డి అన్న‌య్య టైటిల్ తో చిరంజీవితో చేద్దామ‌నుకున్నారు. అయితే అప్ప‌టికే కృష్ణారెడ్డి అన్ని చిన్న సినిమాలు చేసి ఉండ‌డంతో ఆయ‌న‌పై న‌మ్మ‌కం లేక ఈ సినిమాను చిరంజీవి రిజెక్ట్ చేశార‌ట‌. ఇక ఆ సినిమా కృష్ణ కెరీర్ ని మ‌లుపుతిప్పి సూప‌ర్ హిట్ అయింది.

ఇవి కూడా చ‌ద‌వండి :  మెట్టినింట్లో కొత్త కోడలు అడుగు పెట్టగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు..?

సాహ‌స‌వీరుడు సాగ‌ర క‌న్య :

జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి అంత భారీగా ఈ సినిమాని చిరంజీవి-మాదురి దీక్షిత్‌ల‌తో చేయాల‌నుకున్నారు కే.రాఘ‌వేంద‌ర్‌రావు. అయితే వ‌రుస సినిమాలు ప‌రాజ‌యం పాల‌వ్వ‌డంతో ఈ రిస్కీ ప్రాజెక్ట్‌ని అటెంప్ట్ చేయ‌డానికి చిరంజీవి ఇష్ట‌ప‌డ‌లేదు. దీంతో ఈ సినిమాను వెంక‌టేష్ చేసి సూప‌ర్ హిట్ కొట్టాడు.

ఆంధ్రావాలా :

మెగాస్టార్ చిరంజీవి కోస‌మే ద‌ర్శ‌కుడు పూరిజ‌గ‌న్నాథ్ రాసుకున్న స్క్రిప్ట్ ఇది. కానీ ఈ స్క్రిప్ట్ న‌చ్చ‌క మెగాస్టార్ దీనిని రిజెక్ట్ చేశారు. దీంతో ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా న‌టించాడు. చిరంజీవి అనుకున్న‌ట్టే ఈ సినిమా ఫ్లాప్ అయింది.

ఇవి కూడా చ‌ద‌వండి :  చిరంజీవి సినిమాల్లో ఈ కామన్ పాయింట్ గమనించారా..మరి ఇంత త్యాగమా..!!

చంద్ర‌ముఖి :

క‌న్న‌డ‌లో ఆప్త‌మిత్రుడు చూశాక అది తెలుగులో చిరంజీవికి సూట్ అవుతుంద‌ని ద‌ర్శ‌కుడు వీ.ఎన్‌.ఆదిత్య చిరుని అడిగారు. ఈ సినిమాని త‌రువాత చేద్దామ‌ని చిరు దాట‌వేశారు. ఇక ఆ త‌రువాత ఆ సినిమా ర‌జినీకాంత్‌తో రూపొంది ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే.

టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు : 

ప్ర‌స్తుతం ర‌వితేజ హీరోగా సెట్స్ పై ఉన్న భారీ పాన్ ఇండియా చిత్రం టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు. తొలుత ఈ సినిమాను చిరంజీని సంప్ర‌దించారు. కానీ అందుకు చిరంజీవి ఒప్పుకోలేదు.

ఇవి కూడా చ‌ద‌వండి :  ప్రముఖ విలన్ రఘువరన్ కొడుకు.. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే.. !

Visitors Are Also Reading