Home » మెట్టినింట్లో కొత్త కోడలు అడుగు పెట్టగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు..?

మెట్టినింట్లో కొత్త కోడలు అడుగు పెట్టగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు..?

by Sravanthi Pandrala Pandrala
Ad

హిందూ సాంప్రదాయం ప్రకారం చాలామంది ఇంట్లో వివాహ శుభకార్యం జరిగిన తర్వాత కొత్త కోడలు మెట్టినింట అడుగుపెట్టక కొన్ని వ్రతాలు, పూజలు చేయిస్తారు. ఇందులో ముఖ్యంగా సత్యనారాయణ వ్రతం అనేది చాలామంది చేస్తూ ఉంటారు.. మరి అలా కొత్త కోడలు ఇంట్లో అడుగు పెట్టగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేస్తారు.. దాని వెనుక ఉన్న కారణం ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాం.. కొత్తగా ఇంటికి వచ్చిన కోడలితో సత్య నారాయణ వ్రతం చేయిస్తే సంసార జీవితం బాగుంటుందని నమ్ముతారు..

Advertisement

ALSO READ:కోమటిరెడ్డి బలాన్ని ప్రియాంకా అంచనా వేసారా…? తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరగవచ్చు…?

Advertisement

కష్టనష్టాల నుంచి బయట పడేసె శక్తి సత్యనారాయణ స్వామికి ఉంటుందని అంటారు.. అయితే ఈ వ్రతం ఎక్కువగా కార్తీకమాసంలో కొత్తగా ఇంటికి అడుగుపెట్టిన కోడలితో చేయించడం చాలా కాలం నుంచి అనాతిగా వస్తోంది. ఈ వ్రతాన్ని ఆచరించే కపోతే దోషం కలుగుతుందని అందుకే ఈ వ్రతాన్ని చేస్తారు.. త్రిమూర్తుల ఏకరూపంగా సత్యనారాయణ స్వామి యొక్క లోకంలో ఆవిర్భవించాడని ఆయన అమితమైన శక్తిని కలిగి ఉంటారని భక్తుల నమ్మకం. కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులకు వారి జీవన ప్రయాణంలో ఇలాంటి సమస్యలు రాకుండా సాఫీగా సాగిపోవాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు..

ఈ వ్రతం చేసేటప్పుడు ఊరిలో చాలా మంది ని పిలుస్తారు. ఆ సమయంలో ఇంటికి వచ్చిన కొత్త కోడలిని వారు చూసినట్టు ఉంటుంది.. వారికి ఆ వూరు వారు కూడా పరిచయం అవుతారని కూడా ఇలా చేస్తారట.. అలాగే కొత్త కోడలికి భయం, బెరుకు లాంటివి కూడా అందరితో కలవడం వల్ల పోతాయని, కోడలిని అందరికీ పరిచయం చేయడం కూడా శుభ సూచకంగా భావిస్తారు అత్తమామలు..

ALSO READ:పవర్ ఫుల్ పాత్రకు కూడా నో చెప్పిన సాయి పల్లవి.. ఎందుకంటే..?

Visitors Are Also Reading