Home » పవర్ ఫుల్ పాత్రకు కూడా నో చెప్పిన సాయి పల్లవి.. ఎందుకంటే..?

పవర్ ఫుల్ పాత్రకు కూడా నో చెప్పిన సాయి పల్లవి.. ఎందుకంటే..?

by Azhar
Ad

సాయి పల్లవి అంటే ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఈ అమ్మడు నటించిన సినిమాలు అన్ని ఈ మధ్య ప్లాప్ అయిన కూడా తన క్రేజ్ అనేది మాత్రం తగ్గలేదు అనే అనే చెప్పాలి. ఎందుకంటే సాయి పల్లవికి ఎక్కువ క్రేజ్ అనేది సినిమాల వల్ల కాకుండా ఆమె బిహేవియర్ వల్ల వచ్చింది. అందుకే సినిమాలు ప్లాప్ అయిన కూడా రేంజ్ తగ్గడం లేదు.

Advertisement

అయితే ఈ క్రేజ్ అనేది తగ్గకపోగా ఇప్పుడు ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ తాను ఏంటో అభిమానులకు నిరూపించుకుంది. అయితే సాయి పల్లవి ఎప్పుడు సినిమాలను హీరో, డైరెక్టర్, రెమ్యునరేషన్ ను చూసి ఒప్పుకోలేదు అనే విషయం అందరికి తెలుసు. తన పాత్రకు మంచి బలం ఉండి సినిమా కథ కూడా బాగుంది… ఎటువంటి గ్లామర్ షో అనేది లేకపోతేనే ఒప్పుకుంటుంది.

Advertisement

గతంలో ఓసారి రెండు కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తాం అన్న ఓ బ్యూటీ ప్రోడక్ట్ యాడ్ లో నటించడానికి నో చెప్పింది. దాంతో సాయి పల్లవికి రెస్పెక్ట్ అనేది పెరిగింది. అయితే ఇప్పుడు సాయి పల్లవి మరోసారి అదే పని చేసింది. కానీ ఇప్పుడు యాడ్ ను కాకుండా ఓ సినిమాకు నో చెప్పింది. ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర అనేది చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. అలాగే రెమ్యునరేషన్ కూడా భారీగా ఆఫర్ చేశారట. కానీ సినిమా కథ విన్న తర్వాత మాత్రం పల్లవి ఈ సినిమాకు నో చెప్పింది అని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

ఆసియా కప్ కోసం కొత్త బ్యాట్ వడబోతున విరాట్..!

కోహ్లీ ముందు బాబర్ ఇంకా బచ్చా..!

Visitors Are Also Reading