Home » ఉప్పెన సినిమా కథను.. వినకుండానే రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

ఉప్పెన సినిమా కథను.. వినకుండానే రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

by Bunty
Published: Last Updated on
Ad

మెగా అండదండలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఒకరు. ముఖ్యంగా బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమా ద్వారా వైష్ణవ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.

Advertisement

ఉప్పెన మంచి హిట్ కావడంతో ఈయనకు అనంతరం క్రిష్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం వచ్చింది. అయితే దర్శకుడు బుచ్చిబాబు ముందుగా ఈ ఉప్పెన కథ రాసుకున్నప్పుడు హీరోగా వైష్ణవ తేజ్ ని అనుకోలేదట. ముందుగా ఈ కథ సిద్ధం చేసుకున్నప్పుడు న్యాచురల్ స్టార్ నాని అయితే హీరోగా బాగా సెట్ అవుతాడని బుచ్చిబాబు భావించాడట. కానీ ఈ విషయంలో మాత్రం బుచ్చి బాబుకు చేదు అనుభవం ఎదురైందట. ఉప్పెన కథను వినిపించాలని ఎంతో ఆశగా నాని ఇంటికి వెళ్ళాడట బుచ్చిబాబు.

Advertisement


అయితే అప్పటికే ఫుల్ కాల్ షీట్స్ తో బిజీబిజీగా ఉన్నాడట నాని. దీంతో ఇక బుచ్చిబాబు కథ అసలు ఎలా ఉందో కూడా వినకుండానే నాని ఇక ఉప్పెన కథను రిజెక్ట్ చేశాడట. ఇక తర్వాత పలువురు యంగ్ హీరోస్ దగ్గరికి ఈ కథ వెళ్ళింది. కానీ స్టోరీ నచ్చిన దర్శకుడు కొత్త కావడంతో రిజెక్టివ్ చేశారట. చివరికి ఈ కథను వైష్ణవ్ తేజ్ చేసి హిట్టు కొట్టాడు.

read also : దేవుడి ఉంగరాలు పెట్టుకుంటున్నారా… అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..?

Visitors Are Also Reading