Home » ఇదేందయ్యా…చితక్కొట్టి ఖర్చులకు డబ్బులు ఇచ్చారు…!

ఇదేందయ్యా…చితక్కొట్టి ఖర్చులకు డబ్బులు ఇచ్చారు…!

by Bunty

శాక్రిఫైజ్ స్టార్ సునీషిత్ మరోసారి తెరపైకి వచ్చాడు. యూట్యూబ్ వీడియోలను చూస్తూ నిత్యం నెట్టింట్లో మునిగి తేలేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ స్టార్స్ పై ఇష్టానుసారంగా వాక్యాలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచేవాడు. ముందు ఆ సినిమా ఛాన్స్ నాకే వచ్చిందంటూ విచిత్రమైన కామెంట్స్ చేస్తుంటాడు. ఇది ఇలా ఉండగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సునిశిత్… రామ్ చరణ్ భార్య ఉపాసన పై అనుచిత వాక్యాలు చేశారు.

మళ్లీ ఆయన చిరంజీవి పెద్ద కూతురు సుస్మితని నేనే పెళ్లి చేసుకోవాల్సింది అని, కానీ కొన్ని కారణాలు చేత చేసుకోలేకపోయాను అని కూడా చెప్పుకొచ్చాడు. ఇవన్నీ విని ఆవేశంతో రగిలిపోయిన రామ్ చరణ్ ఫ్యాన్స్ సునిషిత్ ని ఇంటికి వెళ్లి చితక్కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అనంతరం మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పాడు సునిశిత్. కానీ తాజాగా ఓ విషయం బయటకు వచ్చింది. అది కూడా వీడియో రూపంలో అదేంటంటే… సునీశిత్ ను చితకొట్టిన రాంచరణ్ అభిమానులు తర్వాత కొంత డబ్బులు ఇచ్చారు.

అంతే కాదండోయ్…”అలా మాట్లాడటం తప్పు.. లేడీస్ గురించి అలా మాట్లాడొద్దు. ఖర్చులకు ఈ డబ్బులు ఉంచుకో. నీకు దెబ్బలు పడటానికి గల కారణం ఏంటో నీకు తెలుసు. అలా చేయడం తప్పు.. ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడడం తప్పు. మొన్నటి వరకు సినిమా గురించి మాట్లాడావు. కానీ నిన్ను ఎవరు ఏమీ అనలేదు. కానీ ఇప్పుడు ఎందుకు పడ్డాయి… అది తప్పు. ఇకపై రామ్ చరణ్ గారు, ఉపాసనగారే కాదు… అసలు ఏ హీరో గురించి అయినా తప్పుగా మాట్లాడొద్దని చెప్పారట. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

ప్రభాస్ అన్న ప్రబోధ్ లైఫ్ స్టైల్… జైలు జీవితం నుంచి బిజినెస్ మ్యాన్!

BoyapatiRAPO : దున్నపోతుతో రామ్ ఎంట్రీ అదుర్స్…. మాస్ కు ఫ్యాన్స్ కు జాతరే

భీమ్లా నాయక్ సినిమాకు జగన్ వల్ల రూ. 30 కోట్లు నష్టం వచ్చిందా ?

 

Visitors Are Also Reading