Home » ఇక నుంచి అన్ని ఆసుపత్రుల్లో క్యాష్ లెస్..!

ఇక నుంచి అన్ని ఆసుపత్రుల్లో క్యాష్ లెస్..!

by Anji
Ad

ప్రైవేటు ఆసుపత్రుల్లో ట్రీమ్ మెంట్ కి సంబంధించి కీలక నిర్ణయం వెలువడింది. ఆరోగ్య బీమా తీసుకున్న వారు అన్ని ఆసుపత్రుల్లో క్యాష్ లెస్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఈ రోజు నుంచే అందుబాటులోకి వచ్చినట్టు ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ వెల్లడించింది. జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలతో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు  తెలిపింది. ఇన్సూరెన్స్ పాలసీ నెట్ వర్క్ జాబితాలో పేరు లేని ఆసుపత్రిలో కూడా క్యాష్ లెస్ సదుపాయాన్ని పొందవచ్చు.

Advertisement

Advertisement

నెట్ వర్క్ ఆసుపత్రి జాబితాలో లేని హాస్పిటల్ లో క్యాష్ లెస్ సదుపాయం పొందేందుకు 48 గంటల ముందు ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి. అత్యవసర సమయాల్లో అయితే ఆసుపత్రిలో చేరిన 48 గంటల్లోపు సమాచారాన్ని చేరవేయాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ పాలసీ షరతులు, నిబంధనల ఆధారంగా క్లెయిం వర్తిస్తుందని కౌన్సిల్ పేర్కొంది. ప్రస్తుతం ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే నెట్ వర్క్ హాస్పిటల్స్ లో మాత్రమే క్యాష్ లెస్ కి అనుమతి ఉంది. క్యాష్ లెస్ సదుపాయం లేని చోట ట్రీట్ మెంట్ కి అయ్యే ఖర్చును జేబులోంచి చెల్లించాల్సి ఉంటుంది. తరువాత రీయంబర్స్ మెంట్ కు దరఖాస్తు చేసుకోవాలి.

ఈ ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటం.. రిఫండ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక నుంచి ఈ సమస్యలు తప్పనున్నాయి.  క్యాష్ లెస్ గురించి ఇప్పటికే ఆయా కంపెనీలు కస్టమర్లకు సందేశాలు పంపిస్తున్నాయి.

 

 

Visitors Are Also Reading