Home » శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను ప‌క్క‌న పెట్ట‌డానికి కార‌ణం ఏమిటో చెప్పిన రోహిత్

శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను ప‌క్క‌న పెట్ట‌డానికి కార‌ణం ఏమిటో చెప్పిన రోహిత్

by Anji
Ad

వెస్టిండిస్‌తో ఫిబ్ర‌వ‌రి 16న జ‌రిగిన జ‌రిగిన మొద‌టి టీ-20 మ్యాచ్‌లో యువ ఆట‌గాడు శ్రేయాస్ అయ్య‌ర్‌కు చోటు ద‌క్క‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇటీవ‌ల వెస్టీండిస్‌తో జ‌రిగిన మూడ‌వ వ‌న్డే మ్యాచ్ లో శ్రేయాస్ కీల‌క ఇన్నింగ్ ఆడిన విష‌యం తెలిసిన‌దే. వెస్టిండిస్‌పై అద్భుతంగా బ్యాటింగ్ చేసిన శ్రేయాస్ కు తొలి టీ-20లో చోటు ద‌క్క‌లేదు. ఈ విష‌యంపై తాజాగా భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ స్పందించారు. ముఖ్యంగా అయ్య‌ర్‌ను ప‌క్క‌కు పెట్ట‌డానికి సంబంధించిన కార‌ణాలు వివ‌రించాడు.

Also Read :  CORONA : త‌గ్గుముఖం ప‌ట్టిన మ‌హ‌మ్మారి…ఆంక్ష‌లు ఎత్తేస్తున్న‌ రాష్ట్రాలు…!

Advertisement


టీమిండియాలో శ్రేయాస్ అయ్య‌ర్ లాంటి కీల‌క ఆట‌గాడిని ప‌క్క‌కు పెట్ట‌డం చాలా క‌ష్ట‌మే. కానీ మిడిల్ ఓవ‌ర్ల‌లో బౌలింగ్ చేయ‌గ‌ల ఆట‌గాడు జ‌ట్టుకు చాలా అవ‌స‌రం. కాబ‌ట్టి అత‌న్ని ప‌క్క‌కు పెట్ట‌డం త‌ప్ప‌లేదు. శ్రేయాస్ విష‌యంలో మేము స్ప‌ష్టంగానే ఉన్నాం. ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టులో అత‌నికీ క‌చ్చితంగా చోటు ఉంటుంది. ముఖ్యంగా జ‌ట్టుకు ఏమి కావాలో ఆట‌గాళ్ల‌కు బాగా తెలుసు. ఆట‌గాళ్లు అంద‌రూ ఉన్న‌ప్పుడూ ఎవ‌రినో ఒక‌రినీ ప‌క్క‌న పెట్టక‌ త‌ప్ప‌దు. ఆట‌గాళ్లు ఈ విష‌యాన్ని అర్థం చేసుకోవాలి.

Advertisement

ముఖ్యంగా ఆట‌గాళ్ల కంటే ముందు క్రీడాభిమానులు అర్థం చేసుకుంటే బాగుంటుంది. తుది జ‌ట్టు విష‌యంలో చాలా విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. జ‌ట్టు అవ‌స‌రాల‌కు అనుగుణంగా రాణించే ఆట‌గాళ్ల విష‌యంలో మాకు స్ప‌ష్ట‌త ఉంది. యువ ఆట‌గాళ్లు కూడా జ‌ట్టు విజ‌యానికి మొద‌టి ప్రాధాన్య‌త ఇస్తార‌నుకుంటున్నాను. చాలా కాలంగా ఇషాన్ కిష‌న్ ఓపెన‌ర్‌గా రాణిస్తున్నాడు. ఐపీఎల్‌లో కూడా ముంబ‌యి ఇండియ‌న్స్ త‌రుపున అత‌ను బ‌రిలోకి దిగుతున్నాడ‌ని రోహిత్ శ‌ర్మ తెలిపాడు. తొలి టీ-20 మ్యాచ్‌లో రిష‌బ్‌పంత్‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌, వెంక‌టేష్ అయ్య‌ర్ మిడిలార్డ‌ర్‌లో బ్యాటింగ్‌కు దిగిన విష‌యం విధిత‌మే. మ‌రొక వైపు సూర్య‌కుమార్ యాద‌వ్ బౌలింగ్ వేసేందుకు కూడా సిద్ధం అని ప్ర‌క‌టించ‌డంతో చ‌ర్చ కొన‌సాగుతుంది. మ‌రికొంద‌రూ రోహిత్ శ‌ర్మ ముంబ‌యి ఇండియ‌న్స్ జ‌ట్టులో ఉన్న ఆట‌గాళ్ల‌కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని పేర్కొన‌డం విశేషం.

Also Read :  అర్థరాత్రి పోలీస్ స్టేష‌న్‌లో ఎంపీ హల్‌చ‌ల్

Visitors Are Also Reading