Home » అర్థరాత్రి పోలీస్ స్టేష‌న్‌లో ఎంపీ హల్‌చ‌ల్

అర్థరాత్రి పోలీస్ స్టేష‌న్‌లో ఎంపీ హల్‌చ‌ల్

by Anji
Ad

ఏపీలోని బాప‌ట్ల‌కు చెందిన ఎంపీ నందిగం సురేష్ మ‌రొక‌సారి వివాదంలో చిక్కుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ విజ‌యవాడ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డిన అనుచ‌రుల‌ను విడిపించుకునేందుకు అర్థ‌రాత్రి స‌మ‌యంలో కృష్ణ‌లంక పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లారు. ఎంపీతో పాటు అత‌ని అనుచ‌రులు విజ‌య‌వాడ‌లో హ‌ల్‌చ‌ల్ చేశారు. దీంతో ఆ పోలీస్ స్టేష‌న్‌లో అర్థరాత్రి అల‌జ‌డి రేగింది.

Also Read :  బీజేపీది బూట‌కపు జాతీయ‌వాదం..మోడీపై మ‌న్మోహ‌న్ సింగ్ ఫైర్..!

Advertisement

ఈ ఘ‌ట‌న మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి జ‌రిగినా.. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఎంపీ నందిగాం సురేష్ మేన‌ల్లుడు మ‌రొక ఇద్ద‌రు స్నేహితుల‌తో క‌లిసి విజ‌య‌వాడ‌లోని స్వ‌ర్ష మ‌ల్టిప్లెక్స్‌లో సినిమాకు వెళ్లారు. సినిమా ముగించుకుని త‌రువాత వీరు అదే బైకు పై ఇండ్ల‌కు బ‌య‌లుదేరారు. ఈ త‌రుణంలో అర్థ‌రాత్రి రోడ్డుపై వాహ‌నాలు ఏవీ లేక‌పోవ‌డంతో బైకును వేగంగా పోనిచ్చారు. ఇలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న వీరిని బ‌స్టాండ్ ఎదురుగా గంగోత్రి హోట‌ల్ వ‌ద్ద పెట్రోలింగ్ నిర్వ‌హిస్తున్న పోలీసులు ఆపారు.

Advertisement

 

ఆ స‌మ‌యంలో యువ‌కులు పోలీసుల‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. వాగ్వివాదానికి దిగ‌డంతో ఆగ్ర‌హించిన ఎస్సై వీరిపై చేసుకుని పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఎస్సై త‌మ‌పై దాడి చేయ‌డాన్ని వీడియో తీసుకున్న యువ‌కులు ఎంపీ నందిగాం సురేష్‌కు పంపించారు. దీంతో కోపోద్రిక్తుడైన ఆయ‌న అనుచ‌రుల‌తో క‌లిసి అర్థరాత్రి పోలీస్ స్టేష‌న్‌కు చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావ‌ర‌ణ ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. ఎంపీ వెంట వ‌చ్చిన అనుచ‌రులు ఎస్సైతో పాటు ఇత‌ర సిబ్బందితో వాగ్వాదానికి దిగ‌డ‌మే కాదు.. బాహాబాహికి సిద్ధం అయ్యారు. ఈ తంతంగాన్ని శ్రీ‌నివాస్ అనే కానిస్టేబుల్ సెల్ ఫోన్‌లో వీడియో తీయ‌సాగాడు. ఇది చూసిన ఎంపీ అనుచ‌రులు అత‌న్ని వ‌ద్ద నుంచి ఫోన్ లాక్కోవ‌డంతో పాటు దాడి చేశారు. పోలీస్ స్టేష‌న్‌లో ఉన్న‌టువంటి ఫ‌ర్నీచ‌ర్‌ను కూడా ధ్వ‌సం చేశారు.

Also Read :  ముంబై : రెండు రైల్వేలైన్ల‌ను ప్రార‌భించ‌నున్న ప్ర‌ధాని…!

వారు పోలీస్ స్టేష‌న్ నుంచి వాళ్లు వెళ్లుతుండ‌గా త‌న సెల్ ఫోన్ తిరిగి ఇవ్వాల‌ని కానిస్టేబుల్ అడ‌గ‌డంతో మ‌రొక‌సారి అత‌న్ని కింద ప‌డేసి మ‌రీ దాడికి దిగారు ఎంపీ అనుచ‌రులు. త‌మ క‌ళ్ల ముందే ఓ కానిస్టేబుల్‌పై దాడి చేస్తున్నా మిగ‌తా సిబ్బంది అడ్డుకోలేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ ఘ‌ట‌న‌పై ర‌క్షించాల్సిన పోలీసుల‌కే ర‌క్ష‌ణ లేకుండా పోతే.. ప్ర‌తిప‌క్షాలు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నాయి. ముఖ్యంగా పోలీస్ స్టేష‌న్‌లో ఫ‌ర్నిచ‌ర్ ధ్వంసం చేసి పోలీసులపై దాడికి య‌త్నించిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌తిప‌క్ష నాయ‌కులు డిమాండ్ చేస్తున్నారు.

Visitors Are Also Reading