Home » Butta Bomma : ఓటీటీ లోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ బుట్టబొమ్మ…ఎందులో స్ట్రీమింగ్ అంటే !

Butta Bomma : ఓటీటీ లోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ బుట్టబొమ్మ…ఎందులో స్ట్రీమింగ్ అంటే !

by Bunty
Ad

మలయాళం మూవీస్ తెలుగులో రీమేక్ కావడం చాలా కామన్ అయిపోయింది. అలా ఆ ఇండస్ట్రీ నుంచి రీమేక్ అయిన మరో తెలుగు మూవీ బుట్టబొమ్మ. ఈ సినిమా ఫిబ్రవరి 4న థియేటర్లలోకి వచ్చింది. మలయాళం లో హిట్ అయినా కప్పెలా సినిమాకు ఈ బుట్టబొమ్మ రీమేక్. చైల్డ్ ఆర్టిస్ట్ గా సత్తా చాటిన అనిఖా సురేంద్రన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన చిత్రం బుట్టబొమ్మ. పల్లెటూరి ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలో సూర్య వశిష్ట్, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషించారు. మలయాళం లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ కప్పేలాను తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా కొత్త దర్శకుడు శౌరి చంద్రశేఖర్,

READ ALSO : Pawan Kalyan : పవన్ లేడీ ఫ్యాన్ సూ**డ్ నోట్ వైరల్.. హరీష్ శంకర్ కు వార్నింగ్ ఇస్తూ!

Advertisement

Advertisement

టి రమేష్ బుట్టబొమ్మను తెరకెక్కించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. టీజర్లు, ట్రైలర్లతో రిలీజ్ కు ముందు ఎన్నో అంచనాలు పెంచేసిన బుట్టబొమ్మ థియేటర్లలోకి విడుదలయ్యాక మాత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఫిబ్రవరి 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తారుగా మాత్రమే ఆడింది. అయితే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కావడం అనిఖా సురేంద్రన్ యాక్టింగ్ యువతను థియేటర్లకు రప్పించాయి.

READ ALSO : Manchu Manoj : మోహన్ బాబు సమక్షంలో మంచు మనోజ్ పెళ్లి..ఇదిగో ఫోటోలు

ఇదిలా ఉంటే థియేటర్లలో ఓ మోస్తారుగా ఆడిన ఈ పల్లెటూరి ప్రేమ కథ చిత్రం ఓటిటీ లోకి వచ్చేసింది. బుట్టబొమ్మ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసింది. థియేట్రికల్ రన్ పూర్తి కావడంతో ఇవాల్టి నుంచి నెట్ఫ్లిక్స్ లో స్టీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ ప్రేక్షకులకు అందుబాటులో ఉంది.

READ ALSO : హైదరాబాద్ లో ఫాక్స్ కాన్ మెగా పెట్టుబడి, 1 లక్ష ఉద్యోగాలు

Visitors Are Also Reading