Home » Pawan Kalyan : పవన్ లేడీ ఫ్యాన్ సూ**డ్ నోట్ వైరల్.. హరీష్ శంకర్ కు వార్నింగ్ ఇస్తూ!

Pawan Kalyan : పవన్ లేడీ ఫ్యాన్ సూ**డ్ నోట్ వైరల్.. హరీష్ శంకర్ కు వార్నింగ్ ఇస్తూ!

by Bunty
Ad

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రామోజీ ఫిలిం సిటీ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతుంది. కాగా షూటింగ్ లోకేషన్ లో స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రత్యక్షమైన స్టిల్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కొద్దిరోజులు ఈ ప్రాజెక్టు గురించి పలురకాల వార్తలు నెట్టింట ప్రచారం జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి : క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్, విశాఖలో టీమిండియా మ్యాచ్‌లు

Advertisement

తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన తేరి సినిమాను హరీష్ రీమిక్స్ చేయనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ రూమర్స్ పై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా రీమేక్ చేసే ఆలోచన మానుకోవాలని, ఆ మూవీ రీమేక్ అంటూ ప్రకటన మాత్రం రావొద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా దర్శకుడికి డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

దీంతో నెట్టింట #WeDontWantTheirRemake హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఏకంగా పవన్ కళ్యాణ్ లేడీ వీరాభిమాని సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ హరీష్ శంకర్ కు ఆ*** యత్నం నోట్ రాశారు. “ఇప్పటివరకు ఒక్క లెటర్ రాయని నేను ఆ*** యత్నం లెటర్ రాస్తానని కలలో కూడా అనుకోలేదు. మీరు ఎన్ని రీమేక్స్ తీసిన ఎప్పుడు ఇంత ఫీల్ అవ్వలేదు. కానీ తేరి రీమేక్ అని తెలిసాక రాయక తప్పలేదు. కనీసం నా చావుని చూసి క్యాన్సిల్ చేస్తారని అనుకుంటున్నాను. ఆల్రెడీ ప్రతి ఆదివారం టైమింగ్స్ మార్చి టీవీల్లో తేరి సినిమాను వేస్తున్నారు. ప్లీజ్ సర్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయండి. నా చావుకు కారణం మైత్రి మూవీ మేకర్స్ టీమ్, డైరెక్టర్ హరీష్ శంకర్. చిన్న మనవి, అభిమానుల ఎమోషన్స్ తో ఆడుకోకండి”. అంటూ రాశారు. ఇప్పటివరకు ఈ ట్వీట్ కు వందల్లో రీట్వీట్స్ వచ్చాయి. మరోవైపు అభిమాని రాసిన సూ**డ్ లెటర్ ను వాడేస్తూ, మాకు తేరి రీమేక్ వద్దు అన్నయ్య, అంటూ మీమ్స్ చేస్తున్నారు. ఒకవేళ తేరి రీమేక్ ప్రకటన వస్తే మాత్రం నెగటివ్ ట్రెండ్ చేస్తామంటే ట్వీట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

read also : షాయాజీ షిండే నన్ను మోసం చేశాడు.. ఫిర్యాదు చేసిన నిర్మాత..

Visitors Are Also Reading