టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా వరుసగా పరాజయాలల్లో ఉన్న అఖిల్ అక్కినేనికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కథానాయకుడిగా ఫస్ట్ సక్సెస్ సాధించారు. 2021లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో సాప్ట్ రోల్ లో కనిపించిన అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ చిత్రం కోసం పూర్తిగా ట్రాన్స్ ఫామ్ అయ్యాడు. ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
Also Read : చిరంజీవి సీరియల్ లో నటించాడనే విషయం మీకు తెలుసా ?
Advertisement
పాన్ ఇండియా లెవల్ లో విడుదలవుతున్న ఈ చిత్రానికి దర్శకుడు సురేందర్ రెడ్డి. స్పై యాక్షన్ థ్రిల్లింగ్ అంశాలతో రూపొందించిన ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సురేందర్ 2 సినిమాస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమా రన్ టైమ్ లాక్ అయినట్టు తెలుస్తోంది. రన్ టైం 2గంటల 30 నిమిషాలు ఉండనున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు హిప్ హాప్ సంగీతమందించారు. ఈ సినిమా అఖిల్ సినీ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందట. ఈ సినిమా బడ్జెట్ ముందు రూ.50కోట్ల లోపు అనుకున్నా.. తరువాత బడ్జెట్ పెరిగి రూ.70 కోట్లు దాక అయిందట. తాజాగా ఏజెంట్ నిర్మాత రూ.80 కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమా నిర్మాణం అయిందని తెలియజేశారు. వీటికి తోడు ప్రమోషన్స్ తో ఏకంగా రూ.85కోట్ల వరకు అయింటుదని టాక్ వినిపిస్తోంది.
Advertisement
Also Read : బాలయ్య భైరవద్వీపం సినిమాతో చిరంజీవి, రజినీకాంత్ లకు ఉన్న లింక్ ఏంటి..?
ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో కనిపించనుననాడు. డీనో మోరియో మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరో అఖిల్ పాత్ర వైల్డ్ గా సాగడంతో పాటు ఆద్యంతం ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ సినిమా సక్సెస్ అఖిల్ కు చాలా ముఖ్యమనే చెప్పాలి. ఈ చిత్రానికి వక్కతం వంశీ కథను అందిస్తున్నారు. ఇంటర్నెట్ సీక్వెన్స్ లో భారీ ట్వీస్ట్ ఉంటుందని సమాచారం. స్క్రీన్ ప్లే కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తోంది.
Also Read : Agent : “ఏజెంట్” సినిమా ట్రైలర్…దుమ్ములేపిన అఖిల్