Home » బాల‌య్య భైర‌వ‌ద్వీపం సినిమాతో చిరంజీవి, ర‌జినీకాంత్ ల‌కు ఉన్న లింక్ ఏంటి..?

బాల‌య్య భైర‌వ‌ద్వీపం సినిమాతో చిరంజీవి, ర‌జినీకాంత్ ల‌కు ఉన్న లింక్ ఏంటి..?

by AJAY
Ad

నట సింహం నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో ఒకే రకమైన పాత్రల‌లో నటించకుండా వైవిద్యమైన పాత్రల‌లో నటించాడు. సాంఘిక, జానపద, మాస్ ఓరియెంటెడ్ సినిమాలలో ఆయన నటించి మెప్పించారు. ఇక బాలకృష్ణ కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాల్లో భైరవద్వీపం సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో బాలయ్య అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్నారు.

Advertisement

బాలయ్య కెరీర్ లోనే భైరవద్వీపం సినిమా టాప్ లో ఉంటుంది. ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. అంతేకాకుండా విజయ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించింది. సింగీతం శ్రీనివాస్ బృందావనం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన తర్వాత విజయ నిర్మాణ సంస్థ వారు మరో సినిమా చేసే ఆఫర్ ను దర్శకుడికి ఇచ్చారు.

Advertisement

అంతేకాకుండా పాతాళభైరవి లాంటి ఒక జానపద కథను తెర‌కెక్కించాల‌ని దర్శకుడికి సూచించారు. దాంతో దర్శకుడు క‌థ‌ను రాసుకుని బాల‌య్య‌కు వినిపించారు అదే భైరవద్వీపం సినిమా కథ. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అప్పట్లో ఫుల్ బిజీగా ఉన్న రోజాను తీసుకున్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో కె.ఆర్ విజయ్ కుమార్, బాబు మోహన్, రంభ, సుత్తివేలు ముఖ్యమైన పాత్రల‌లో నటించారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు రజినీకాంత్ చిరంజీవిలకు ఓ లింక్ ఉన్న సంగతి చాలామందికి తెలియదు. ఈ సినిమా షూటింగ్ 1993 జూన్ 5న మద్రాస్ లోని వాహిని స్టూడియోలో ప్రారంభమైంది. కాగా ఈ ప్రారంభోత్సవానికి రజనీకాంత్ మరియు చిరంజీవి అతిధులుగా విచ్చేశారు. అంతేకాకుండా రజనీకాంత్ ప్రారంభ స‌న్నివేశానికి క్లాప్ కొట్టగా ….చిరంజీవి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అదేవిధంగా ఎన్టీఆర్ ఈ సినిమా ప్రారంభ స‌న్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

ALSO READ : విరూపాక్షలో ఈ అఘోరా పాత్ర హైలెట్ అవుతుందా…?

Visitors Are Also Reading