Home » ప్రభాకర్ కొడుకుపై దారుణంగా ట్రోలింగ్.. ఎందుకంటే..?

ప్రభాకర్ కొడుకుపై దారుణంగా ట్రోలింగ్.. ఎందుకంటే..?

by Anji
Ad

 బుల్లితెర మెగాస్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాకర్. ఒకప్పుడు ఆయనకు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. ఇప్పటికీ అడపాదడపా సీరియల్స్ చేస్తున్న ప్రభాకర్ ఇప్పుడు తన కొడుకు చంద్రహాస్ ని సినిమాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఏకంగా ఒకేసారి మూడు సినిమాలకు ప్లాన్ చేస్తున్నాడంటూ ప్రభాకర్ వెల్లడించారు. తన కుమారుడు చాలా హార్డ్ వర్కర్ అని, మంచి హీరో అవుతాడు అని ఇటీవలే ఓ ప్రెస్ మీట్ ఏర్పాుట చేసి మరీ చెప్పుకొచ్చారు. ఆ ప్రెస్ మీట్ లో చంద్రహాస్ ప్రవర్తన తీరుపై నెట్టింట భారీ ట్రోలింగ్ జరుగుతోంది. మీమ్స్, వీడియాలతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఆడుకుంటున్నారు. ఒక్కో సినిమా కూడా తీయలేదు. అప్పుడే అంత బలుపేంటని నెగిటివ్ కామెంట్స్ కూడా చేయడం విశేషం.


ప్రభాకర్ తన కొడుకుపై ట్రోల్ చేస్తున్న వారిని గట్టిగానే క్లాస్ పీకాడు. నా కుమారుడిని ట్రోల్ చేస్తే జైలులో పెడతా అంటూ సీరియర్ వార్నింగ్ ిచ్చాడు. అయినప్పటికీ కొందరూ ట్రోలర్స్ ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. మరికొందరూ ప్రభాకర్ కొడుకు హీరోగా బాగా రాణించాలని కోరుకుంటున్నారు. చంద్రహాస్ ఇటీవలే డిగ్రీ పూర్తి చేశాడు. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుకోవాలన్నది ఆయన లక్ష్యం. తన పెర్ఫామెన్స్ ను చూపించేందుకు రూ.10 లక్షలతో కవర్ సాంగ్ చేశాడు. ఇక ఇటీవలే ఆయన పుట్టిన రోజు సందర్భంగా తొలి సినిమాను ప్రకటించిన విషయం విధితమే.

Advertisement

Advertisement

Also Read : ముత్యాల్లాంటి NTR చేతిరాత‌…ప్రింట్ కాదండోయ్!

మరో రెండు చిత్రాలు కూడా కన్ఫమ్ అయినట్టు తెలుస్తోంది. ప్రభాకర్ ఇట్స్ గుడ్ అని వైరల్ అవుతోంది. ఎలా అయితేనేం అందరికీ తెలిసిపోయాడు. వాళ్లు తిడుతున్నారా.. పొగుడుతున్నారా అనేది పక్కన పెడితే జనాలకు తెలిసిపోయాడు. తరువాత వాడు ఎంత బాగా చేస్తే.. అంతబాగా ఆదరిస్తారు. ఇప్పుడు వాడు నిలబడిన స్టైల్ వాళ్లకు నచ్చలేదు. అందుకే నచ్చలేదని చెప్పారు. వాడు చేసిన యాక్టింగ్ నచ్చితే ఆకాశానికి ఎత్తేస్తారు. బాగా పెర్ఫామెన్స్ చేస్తే మెచ్చుకుంటారు అని చెప్పుకొచ్చారు. గతంలో కొంత మంది నటులకు సన్ స్ట్రోక్ తగిలిందని.. ఎవరికీ తెలిసి తగ్గలేదన్నారు. బిడ్డ భవిష్యత్ కోసం కష్టపడే క్రమంలో తగిలిందని, తనకు సన్ స్ట్రోక్ తగిలితే నిమ్మకాయ రసం తాగుతా అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు ప్రభాకర్.

Also Read : ఫిట్నెస్ ట్రైనర్ తో ప్రేమలో పడ్డ అమీర్ ఖాన్ బిడ్డ.. అది బాగా నచ్చిందట..!!

Visitors Are Also Reading