Home » ఫిట్నెస్ ట్రైనర్ తో ప్రేమలో పడ్డ అమీర్ ఖాన్ బిడ్డ.. అది బాగా నచ్చిందట..!!

ఫిట్నెస్ ట్రైనర్ తో ప్రేమలో పడ్డ అమీర్ ఖాన్ బిడ్డ.. అది బాగా నచ్చిందట..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రేమ అనేది ఎప్పుడు ఎవరిపై ఎలా పుడుతుందో చెప్పడం కష్టం.. అనుకోకుండానే ఏదో ఒక ఫీలింగ్ కలిగి పుట్టేదే ప్రేమ.. అయితే సాధారణ మనిషుల్లో ప్రేమ అయితే ఎవరూ పట్టించుకోరు కానీ సెలబ్రిటీల ప్రేమ వ్యవహారాలు మాత్రం బయటకు వచ్చిన వారి వార్తలు చిలువలు పలవలుగా వైరల్ అవుతుంటాయి.. అలాంటి బాలీవుడ్ స్టార్ హీరో కూతురు ప్రేమ వ్యవహారం ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా బయటపడింది. ఈ విషయంపై స్పందించిన అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ తన ప్రేమను అధికారికంగా కూడా ప్రకటించింది.. ఆ విశేషాలేమిటో చూద్దాం..బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ప్రేమలో పడ్డ విషయాన్ని బయట పెట్టింది..

ALSO READ:ఆస్కార్ బరిలో ‘ఆర్ఆర్ఆర్’ కాకుండా ‘చేల్లో షో’ ఎలా నామినేట్ అయ్యిందంటే ? అసలు కారణం ఇదే !

Advertisement

గతంలో ఆమె విశాల్ అనే వ్యక్తి తో రిలేషన్ లో ఉండి, పలు సందర్భాల్లో వారి ప్రేమను సోషల్ మీడియా వేదికగా బయట పెట్టింది. అలాగే విశాల్,ఐరాల మద్య మనస్పర్ధలు రావడంతో వీరిద్దరు విడిపోయారు.. దీని తర్వాత ఐరా ఖాన్ తన ఫిట్నెస్ ట్రైనర్ అయినా నుపూర్ షికారేతో లవ్ లో పడింది.. గతంలో అమీర్ ఖాన్ కు ఫిట్ నెస్ ట్రైనర్ గా వ్యవహరించిన నుపూర్ లాక్‌డౌన్‌ నుంచి ఐరాకు కూడా జిమ్ము కు సంబంధించిన విషయాల్లో కోచ్ గా వ్యవహరిస్తున్నారు.. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారి గత కొన్ని నెలలుగా ఇద్దరు కలిసి డేటింగ్ లో కూడా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

ఇటీవల కాలంలో సైక్లింగ్ పోటీలో పాల్గొనేందుకు ఇద్దరు కలిసి విదేశాలకు కూడా వెళ్లారట.. ఈ సైక్లింగ్ పోటీలు ముగిసిన వెంటనే నుపూర్ ఐరా వద్దకు చేరుకొని మోకాళ్లపై కూర్చుని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగారట.. దీనికి ఐరా ఎస్ అంటూ అతని ప్రేమను ఆక్సెప్ట్ చేసిందట. అనంతరం నుపూర్ ఐరాకు ఉంగరాన్ని తొడిగి వారి బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఐరా అతన్ని హత్తుకొని తన ప్రేమను బయట పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజెన్స్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

ALSO READ:బాలయ్య “చెన్నకేశవరెడ్డి” మళ్లీ విడుదల..ఎందుకో తెలుసా..?

Visitors Are Also Reading